EPAPER

Adhaar card: ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అప్ డేట్ గడువు పొడిగించిన కేంద్రం

Adhaar card: ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అప్ డేట్ గడువు పొడిగించిన కేంద్రం

Adhaar free update deadline extended date given: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ ప్రభుత్వ పథకానికి కూడా అర్హులు కారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలన్నా..విద్య సంస్థలలో ప్రవేశాలు కావాలన్నా అధార్ తప్పనిసరిగా మారింది. ఆఖరుకు వాహనం కొనుగోలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారింది. 12 అంకెలు కలిగిన ఆధార్ కార్డు ఇప్పుడు దేశ ప్రజలకు గుర్తింపు కార్డుగా మారింది. మనకు అప్పులిచ్చే బ్యాంకు కు కూడా అధార్ ఉంటేనే అప్పు లభిస్తుంది. ప్రవేటు ఫైనాస్స్ లు కూడా ఇప్పుడు ఆధార్ ఉంటేనే అప్పులు ఇస్తున్నారు. ఆధార్ ఆధారంగా నేరస్తులు ఇట్టే దొరికిపోతారు. పోలీసులకు కూడా కేసులు ఈజీగా ఛేదించవచ్చు.


అత్యంత కీలకం

మన నిత్య జీవితంలో అత్యంత కీలకంగా మారిన ఆధార్ లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు పెళ్లయ్యాక ఆడవారి ఇంటి పేరు, అడ్రెస్ మారిపోతుంది. ఒక్కోసారి మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ తప్పులు దొర్లుతుంటాయి. వాటన్నింటినీ అప్టేట్ చేసుకోవలసి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు తీసుకుని పదేళ్ల తర్వాత దానిని అప్ డేట్ చేసుకోవాలంటూ కేంద్రం ప్రకటించింది అందుకు ఇప్పటిదాకా చాలా గడువే ఇచ్చింది. ఈ అప్ డేట్ ను ఉచితంగానే చేసుకోవచ్చు. అయితే మొన్నటి శనివారంతో అప్ డేట్ చేసుకునే గడువు పూర్తయింది.


Also Read: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!

గడువు పొడిగింపు

ఈ గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 డెడ్ లైన్ విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ కూడా ఇచ్చింది. దాని సాయంతో లాగిన్ అయి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. కేంద్రం మరింత గడువు పొడిగించడంతో ఆధార్ కార్డు వినియోగదారులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Big Stories

×