EPAPER

Stock Trading Scam Case: ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్.. నటి అరెస్ట్, ఎలా జరిగింది?

Stock Trading Scam Case: ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్.. నటి అరెస్ట్, ఎలా జరిగింది?

Stock Trading Scam Case: అత్యాశ పోతే.. అనర్థాలు తప్పవు.. ఈ సామెత నటి బోరాకు అతికినట్టు సరిపోతుంది. ప్రజల వీక్ నెన్‌ను తన బిజినెస్‌గా మార్చుకుంది. నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. ఈ నటి విషయంలోనూ అదే జరిగింది. ఆమె గ్యాంగ్ చేసిన స్కామ్ విలువ అక్షరాలా రెండువేల కోట్ల రూపాయలని తేలింది. చివరకు కటకటాల పాలైంది.


నా ఆలోచన నా వ్యాపారానికి పెట్టుబడి.. ధృవ సినిమాలో విలన్ అరవింద్‌స్వామి చెప్పిన డైలాగ్. సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది అస్సాం నటి సుమిబోరా. వెంటనే తన ఆలోచనను భర్తతోపాటు కొందరితో పంచుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి భారీ స్కెచ్ వేసింది. నాలుగు ఫేక్ సంస్థలను ఏర్పాటు చేసింది నటి బోరా గ్యాంగ్. ఇందులో పెట్టుబడులు పెట్టినవారికి 30 శాతం లాభాలు వస్తాయని ప్రచారం చేసింది.

అసలే మనిషి ఆశా జీవి. పెట్టిన పెట్టుబడికి 30 శాతం రిటర్న్స్ వస్తున్నాయంటే.. ఇదేదో బాగుందని చాలామంది భావించారు. నటి చెప్పిందంటే.. నిజమేనని నమ్మారు అమాయక ప్రజలు. ఎవరికి తోచినట్టు వారు ఫేక్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.


ఆన్‌లైన్ ట్రేడింగ్ కాస్తా.. అస్సాం ఫిల్మ్ ఇండస్ట్రీకి వ్యాపించింది. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు, కూపీ లాగారు.  దీంతో అసలు యవ్వారం బయటపడింది. తొలుత 22 వేల కోట్లని భావించినా, చివరకు 2,200 కోట్లు స్కామ్‌గా తేలింది.

ALSO READ: మీటింగ్ కోసం 2 గంటలు ఎదురుచూపులు.. సీఎంగా రాజీనామాకు రెడీ

ఈ కేసులో తొలుత ప్రధాన నిందితుడి భావిస్తున్న విశాల్ పుకాన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా నటి సుమి బోరా, ఆయన భర్త విచారణకు హాజరుకావాలని కోరారు. దీన్ని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు.

చివరకు న్యాయస్థానం లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఖాకీలు రంగంలోకి దిగేశారు. ఎట్టకేలకు నటి సుమి బోరా, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం అస్సాంలో తీవ్ర ప్రకంపనలు సృష్టి స్తోంది.  బాధితులు లబోదిబోమంటున్నారు. నటి అరెస్ట్‌కు ముందు పెద్ద డ్రామా నడిచింది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రావడంతో.. పోలీసుల వద్ద లొంగిపోతున్నట్లు ఓ వీడియోను విడుదల చేసింది. తాను ఎక్కడికీ పారిపోలేదని, పుకార్లను నమ్మవద్దని రిక్వెస్ట్ చేసింది. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×