EPAPER

Principal Forcibly Removed From Office: ప్రిన్సిపల్‌ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది.. వీడియో వైరల్

Principal Forcibly Removed From Office: ప్రిన్సిపల్‌ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది.. వీడియో వైరల్

UP Principal Forcibly Removed From Office: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళా ప్రిన్సిపల్ ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. అంతేకాదు ఆమె ఫోన్ లాగేసుకుని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా ఆమెను బయటకు పంపారు. ఆ సిబ్బందికి  విద్యాసంస్థ చైర్మన్ కూడా జతకలిశారు. పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రిన్సిపల్‌ను బయటకు తోసేసినట్లు తెలుస్తోంది. నెట్టింట ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే..


అయితే, ఫిబ్రవరిలో జరిగిన యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్ – అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ఎగ్జామ్ పేప్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన బిషప్ జాన్సన్ గర్ల్స్ స్కూల్‌పై ఆరోపణలు వచ్చాయి. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు పేపర్ లీక్ జరిగిందంటూ సంబంధిత అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ సదరు విద్యాసంస్థకు చెందిన ఉద్యోగి వినీత్ జశ్వంత్‌ను అదుపులోకి తీసుకుంది. ఆ వ్యవహారంలో ప్రిన్సిపల్ పారుల్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చిందంటూ యాజమాన్యం ఆరోపణలు చేసింది.

దీంతో ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపల్‌గా షిర్లే మాస్సేను నియమించారు. షిర్లే రావడం చూసి, పారుల్ ప్రిన్సిపల్ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నట్లు సమాచారం. ఇది గమనించిన సిబ్బంది తలుపు తెరిచి, ఆ గది నుంచి ఆమెను బయటకు పంపారు. ఈ క్రమంలో ఆమె ఫోన్‌ను బలవంతంగా తీసేసుకున్నారు. కుర్చీ నుంచి ఆమెను పైకి లేపేశారు. తరువాత షిర్లే వచ్చి బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది అంతా షిర్లేకు అభినందనలు తెలిపారు.


Also Read: లైవ్‌లో మహిళా జర్నలిస్ట్‌పై ఎద్దు దాడి చేసిన వీడియో వైరల్

అయితే, ఈ ఘటనపై పారుల్ కేసు పెట్టారు. తనను లైంగింకంగా వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల్లో ఎక్కడా కూడా ఆమెను భౌతికంగా తాకినట్లుగా లేదంటూ యాజమాన్యం వాదించింది. అంతేకాదు.. తమ విద్యాసంస్థ నుంచి పారుల్ రూ. 2.40 కోట్ల వరకు అక్రమ లబ్ధి పొందిందని ఆరోపించింది. ఇదిలా ఉంటే.. పారుల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఒక విద్యాసంస్థలో ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తుల వ్యవహారశైలిపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

Tags

Related News

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

Gurmeet Ram Rahim: ‘ధనవంతులకో న్యాయం.. పేదవారికో న్యాయం’.. 2 సంవత్సరాలలో రేపిస్టు డేరా బాబాకు 10 సార్లు పెరోల్

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Chhattisgarh Encounter: మావోలకు షాక్, చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి, తప్పించుకున్న అగ్రనేతలు?

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Big Stories

×