EPAPER

Jharkhand Train Accident : ఝార్ఖండ్ రైలు ప్రమాదం.. మరణించింది 12 మంది కాదా ? అధికారులు ఏమంటున్నారంటే..

Jharkhand Train Accident :  ఝార్ఖండ్ రైలు ప్రమాదం.. మరణించింది 12 మంది కాదా ? అధికారులు ఏమంటున్నారంటే..
jharkhand train accident
jharkhand train accident

Train accident in Jharkhand: ఝార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అసనోల్‌ పరిధి జమ్తారాలో ప్రాంతంలో.. ట్రాక్‌ దాటుతుండగా పలువురిని బంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ప్రయాణికులు లేరని, వారంతా ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీ కొట్టడంతో గాయపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొలుత 12 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. కొద్దిసేపటికే అధికారులు.. ప్రమాదంలో మరణించింది ఇద్దరు ప్రయాణికులని ప్రకటించడం గమనార్హం.


అప్రమత్తమైన రెస్క్యూ, రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వైద్య బృందాలను, అంబులెన్స్ లను తరలించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. బెంగళూరు – యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ డౌన్ లైన్ లో వెళ్తుండగా అదే సమయంలో లైన్ పక్కన పడేసి ఉన్న బ్యాలస్ట్ దుమ్ము ఎగురుతోంది. దానిని చూసి రైలులో మంటలు చెలరేగి పొగలు వస్తున్నాయనుకున్నాడు లోకో పైలట్. వెంటనే రైలును ఆపేశాడు.

Read More : శాల్యూట్‌ సరిగా చేయలేదు.. ఏసీపీపై జడ్జి ఆగ్రహం


ఏమైందోనని ప్రయాణికులు కూడా కిందికి దిగారు. ఆ సమయంలోనే ఈఎంయూ రైలు ఢీ కొని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 15 కిలోమీటర్ల దూరంగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఝార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. “జార్ఖండ్‌లోని జమ్తారాలో జరిగిన దుర్ఘటన నాకు బాధను కలిగించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను ” అని ట్వీట్ చేశారు.

“జమ్తారాలోని కల్జారియా స్టేషన్ దగ్గర రైలు ప్రమాదం జరిగిందన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. భగవంతుడు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ కష్ట సమయాలను భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అధికారులు అక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని చంపయి సోరెన్ పేర్కొన్నారు.

“ఝార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు ఆకస్మికంగా మరణించారనే వార్త అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను . గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. కాగా.. ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అసనోల్ – 7679523874 నంబర్ ను సంప్రదించవచ్చు.

Tags

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×