EPAPER

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే ఫ్యామిలీ!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే ఫ్యామిలీ!

Five of family die in road accident in Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని చిదంబరంలో తెల్లవారుజామున లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విల్లుపురం నాగై జాతీయ రహదారిపై కారును వేగంగా వస్తున్న ఓ లారీ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని ఓ ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరు చెన్నై నుంచి మైలాడుతురై వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైందని వెల్లడించారు.

మైలాడుతురైకి చెందిన 56 ఏళ్ల ముహమ్మద్ అన్వర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అనారోగ్యంతో ఉన్న వారి బంధువులను కలుసుకొని చెన్నై నుంచి బయలుదేరారు. ఈ సమయంలో కారును యాసర్ అరాఫత్ నడుపుతున్నాడు. చిదంబరంలోని ముట్లూరు వంతెనపై వచ్చేసరికి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహ్మద్ అన్వర్, యాసర్ అరాఫత్‌తో పాటు ఇద్దరు మహిళలు హజీరా బేగం, హరాఫత్నీషా, మూడేళ్ల బాలుడు మృతి చెందారు.


Also Read: కర్ణాటకలోని నాగమంగళ టౌన్‌లో 144 సెక్షన్.. గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత

రెస్క్యూటీంతోపాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతోకారు భాగాలను తొలగించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Related News

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Big Stories

×