EPAPER

UP Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

UP Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
Uttar Pradesh accident news
6 of family from Bihar killed in road accident in UP’s Jaunpur(Today’s news in telugu): ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని వారణాసి ట్రామా సెంటర్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్‌పూర్ – అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ తిరేహా సమీపంలో శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుంకుంది. బీహార్ లోని  ప్రయాగ్ రాజ్ కు ఒకే కటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్ పూర్ నుంచి కెరకట్ వైపు మలుపుతిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.

 


Read more: ఎవరైతే నాకేంటి..అంబానీ కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సింగర్

ఆ ప్రమాదం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో మరణించిన మృతి దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


పొలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బీహార్ లోని సీతామర్షికి చెందిన గజధర్ శర్మ అతని కుమారుడు చందన్ శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు అతని కుటుంబసభ్యులు తొమ్మిది మంది కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేసారు. ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు ట్రక్కును వదిలేసి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ద్వంసం అయిన కారు, లారీనీ, క్రేన్, జేసీబీల సాయంతో వాటిని తొలగించారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×