Big Stories

Ukraine : రష్యాతో యుద్ధం.. 500 మంది ఉక్రెయిన్ చిన్నారుల బలి..

Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేలమంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ కు చెందిన 500 మందికి పైగా చిన్నారులు బలికావడం తీవ్ర విషాదకరం. స్వయంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఈ విషయాలను వెల్లడించారు.

- Advertisement -

రష్యా ఆయుధాలు, వారి ద్వేషం ఉక్రెయిన్‌ చిన్నారుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిన్నారులలు భవిష్యత్తులో కళాకారులుగా, క్రీడా ఛాంపియన్లుగా ఉక్రెయిన్‌ చరిత్ర పుటల్లో నిలిచి ఉండేవారని అన్నారు. రష్యా దాడుల వల్ల ఎంత మంది మరణించారో కచ్చితంగా చెప్పలేమన్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉండటం వల్ల మరణాల లెక్కలు తేల్చలేకపోతున్నామని జెలెన్‌స్కీ వివరించారు.

- Advertisement -

రష్యా జరిపిన తాజా దాడుల్లో రెండేళ్ల బాలిక మరణించింది. దినిప్రో నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌ భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ చిన్నారి భౌతికకాయాన్ని ఆమె తండ్రే వెలికితీయడం అందర్నీ కలచివేసింది. ఆ వ్యక్తి భార్య కూడా గాయాలతో బయటపడ్డారు. శనివారం రష్యా చేసిన దాడిలో ఐదుగురు చిన్నారుల సహా 22 మంది పౌరులు గాయపడ్డారని స్థానిక గవర్నర్‌ సెర్హి లిసాక్‌ ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News