Big Stories

Corona Virus : చైనాలో 4 కొత్త కరోనా వేరియంట్లు.. భారత్ అప్రమత్తం..

Corona Virus : చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశం అవలంభించిన జీరో కోవిడ్ విధానం మొదటికే ముప్పు తెచ్చింది. తాజాగా ఆంక్షలు ఎత్తివేయడంతో కేసులు భారీగా వస్తున్నాయి. భారీ సంఖ్యలోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మరో భయపెట్టే విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలో బీఎఫ్ -7 రకం వైరస్ వేరియంట్ వల్ల కేసులు ఎక్కువగా వస్తున్నాయని తొలుత భావించారు. కానీ అక్కడ ఒకటి కాదు 4 కొత్త వైరస్ వేరియంట్లు ఉన్నాయని బయటపడింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వ కొవిడ్‌ ప్యానల్‌ చీఫ్‌ ఎన్‌కే అరోడా వెల్లడించారు.

- Advertisement -

చైనా పరిస్థితి చూసి భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అరోడా స్పష్టం చేశారు. చైనా నుంచి సమాచారం సరిగ్గా అందకపోవడంతో వల్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడ కొవిడ్‌ వేవ్‌కు పలు రకాల వేరియంట్లే కారణమని వివరించారు. బీఎఫ్-7 వేరియంట్‌ కేసులు కేవలం 15 శాతమే ఉన్నాయని తెలిపారు. బీఎన్‌, బీక్యూ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తున్నాయని చెప్పారు. ఎస్‌వీవీ వేరియంట్‌ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్లే చైనాలో కరోనా వైరస్ బాధితుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.

- Advertisement -

భారత్ ప్రజల్లోని హైబ్రీడ్‌ ఇమ్యూనిటీ ఉందని అరోడా తెలిపారు. ఈ వ్యాధి నిరోధకత వ్యాక్సిన్ల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, కొవిడ్‌ ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్‌ల వల్ల వచ్చిందని స్పష్టం చేశారు. చైనా ప్రజలు ఇంతకు ముందు పెద్దగా ఇన్ఫెక్షన్‌ బారిన పడలేదని వివరించారు. వారికి ఇచ్చిన వ్యాక్సిన్లు తక్కువ ప్రభావవంతమైనవని అనుమానం వ్యక్తం చేశారు. టీకాలు మూడు నాలుగు డోసులు తీసుకొన్నా కేసులు రావడంపై విస్మయం వ్యక్తం చేశారు.

చైనాతో పోలిస్తే భారత్‌లో 97 శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారని అరోడా వివరించారు. మిగిలిన వారు కనీసం ఒక్కసారైనా కొవిడ్‌ బారిన పడినట్లు పేర్కొన్నారు. ఇక 12 ఏళ్ల లోపు పిల్లల్లో 96 శాతం మంది ఒక్కసారి వైరస్‌ బారిన పడినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పుడూ చాలా మందికి కొవిడ్‌ సోకిందని తెలిపారు. అన్ని అంశాలను విశ్లేసించి చూస్తే భారత్ చాలా సురక్షింతంగా ఉందని అరోడా స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News