EPAPER

Mumbai Rains: 6 గంటల్లో 30 సెం.మీల వాన.. ముంబైని షేక్ చేసిన వరుణుడు..

Mumbai Rains: 6 గంటల్లో 30 సెం.మీల వాన.. ముంబైని షేక్ చేసిన వరుణుడు..

Mumbai rains news today(Live tv news telugu): ముంబైని వరుణుడు షేక్ చేశాడు. ఆదివారం అర్థరాత్రి తరువాత నుంచి సోమవారం ఉదయం ఏడు గంటలవరకు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. జనజీవనం అస్తవస్త్యంగా మారింది.


కేవలం ఆరు గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోవండీ ప్రాంతంలో అత్యధికంగా 3.15 సెం.మీ, పోవాయ్‌లో 3.14 సెం.మీ వర్షపాతం నమోదైంది. ముంబై వాసులు ఎక్కువగా వినియోగించే సబర్బన్ రైళ్లకు బ్రేక్ పడింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలా రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోయింది.

నగరంలో భారీ వర్షం కురవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. పలు విమానయాన సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులను అలర్ట్ చేశాయి. అటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం అందరికీ సెలవు ప్రకటించింది.


ముంబైలోని కుర్లా,ఘట్‌కోపర్ ప్రాంతాలలో అలాగే రాష్ట్రంలోని థానే, వసాయి (పాల్ఘర్), మహద్ (రాయ్‌గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, సింధుదుర్గ్‌లతో సహా ఇతర ప్రాంతాలలో జాతీయ విపత్తు బృందాలను మోహరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Tags

Related News

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

×