EPAPER

Earthquake in Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా?

Earthquake in Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా?

Earthquake in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ఉదయం 6 గంటల 36 నిమిషాలకు భూ ప్రకంపనలు రాగా.. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ) వెల్లడించింది. కిష్త్వార్ లో ఉన్నట్లుండి భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై.. బయటకు పరుగు లంకించారు. కాగా.. భూకంపం కారణంగా ఆస్తినష్టమేమైనా జరిగిందా అన్న వివరాలేవీ తెలియరాలేదు.


సోమవారం రాత్రి కూడా భూకంపం సంభవించింది. లడఖ్ పరిధిలోని కార్గిల్ కు సమీపంలో గత రాత్రి 9 గంటల 35 నిమిషాలను భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైనట్లు తెలిపింది. ఈ భూకంపం భూమిలోపల 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

నాలుగు రోజుల క్రితం కూడా జమ్మూ కశ్మీర్ లో చిన్న చిన్న ప్రకంపనలు వచ్చాయి. శ్రీనగర్, గుల్ మార్గ్ ప్రాంతాల్లో 3.9 తీవ్రతతో భూకంపం రాగా.. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×