EPAPER

Air India- Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో నిరుద్యోగుల తొక్కిసలాట.. 2వేల పోస్టులకు 25వేలమందికి పైగా హాజరు

Air India- Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో నిరుద్యోగుల తొక్కిసలాట.. 2వేల పోస్టులకు 25వేలమందికి పైగా హాజరు

25,000 turn up For 600 Jobs, Stampede like situation at Mumbai Airport: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉందనడానికి నిన్న ముంబై ఎయిర్ పోర్టులో జరిగిన నిరుద్యోగుల తొక్కిసలాటే నిదర్శనం. ముంబై ఎయిర్ పోర్టులో లోడింగ్ అన్ లోడింగ్ పనులకు ఎయిర్ ఇండియా ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. దాదాపు 2వేల పోస్టులకు ప్రకటన విడుదల చేయగా ఇంటర్యూలకు 25వేలమందికి పైగా యువకులు తరలిరావడంతో ఎయిర్ పోర్టులో తొక్కిసలాటకు కారణమైంది. వారిని అదుపుచేయలేక ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. ఇటువంటి ఘటనే ఇటీవల గుజరాత్ లోని అంకలేశ్వర్ లో జరిగింది.


10 పోస్టులకు ఇంటర్వ్యూలకు పిలవగా 1800 మంది నిరుద్యోగులు రావడంతో నిర్వాహకులు నిశ్చేష్టులయ్యారు. ముంబై ఎయిర్ పోర్టులో జరిగిన తొక్కిసలాటకు ఇంటర్వ్యూ ఏర్పాట్ల లోపం కూడా కారణమని కొందరు బాధితులు పేర్కొన్నారు. నిరుద్యోగులను గంటల తరబడి వెయిట్ చేయించారని కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బేసిక్ క్వాలిఫికేషన్, శారీరకంగా దృఢంగా ఉన్నవారిని ఉద్యోగాలకు ఆహ్వానించారని, నెలకు 20వేల నుంచి 25వేల వరకు వేతనం ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి నిరుద్యోగులు తండోపతండాలుగా తరలి వచ్చారు.

తనకు 22వేల 500 శాలరీ ఆఫర్ చేశారని బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రార్థమేశ్వర్ అనే అభ్యర్థి చెప్పాడు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించాలని అతడు కోరాడు. రాజస్థాన్ లోని అల్వాల్ నుంచి ఎంకామ్ పట్టభద్రుడు మరొకరు కూడా ఎయిర్ పోర్టులో కార్మికుడి ఉద్యోగానికి వచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది.


Also Read: మోదీకి పెరిగాల్సింది ఓటర్లు..ఫాలోవర్స్ కాదు

ముంబై ఎయిర్ పోర్టులో నిరుద్యోగుల తొక్కిసలాట వీడియో వైరల్ కావడంతో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ నిరుద్యోగ సమస్యకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని ట్వీట్ చేశారు. గత పదేళ్లలో దేశంలో నిరుద్యోగ సమస్య చాలా దారుణంగా ఉందని, రష్యా..ఇజ్రాయెల్ కోసం యుద్ధం చేయడానికి కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×