EPAPER

Vijay Divas: జయహో.. విజయ్ దివస్ : నేటికి 25 ఏళ్లు

Vijay Divas: జయహో.. విజయ్ దివస్ : నేటికి 25 ఏళ్లు

Kargil vijay diwas 25 years celebrations(Today’s news in telugu): భారత చరిత్రలోనే సగర్వంగా చెప్పుకునే రోజు ఇది..పాక్ దురహంకారానికి చెంప పెట్టు ఆ యుద్ధం. భారతదేశ పౌరులు సగర్వంగా మన సైన్యాన్ని స్మరించుకునే రోజు..మది నిండా మువ్వన్నెలు పులుముకునేలా చేసిన రోజు..జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అని పాడుకునే పవిత్రమైన రోజు..కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ తోకముడిచి పారిపోయిన రోజు ఏటా విజయ్ దివస్ పేరుతో మనం జరుపుకునే కార్యక్రమం ఇది. సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం ఇదే రోజున జులై 26న ముగిసింది. భారత భూభాగంపై కన్నేసిన పాకిస్తాన్ మన భూభాగంలో ప్రవేశించి కయ్యానికి కాలు దువ్వాయి.


పాక్ గర్వమణిచిన ఇండియన్ ఆర్మీ

గతంలోనూ పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు కళ్లెం వేస్తూ సాగించిన యుద్ధాలన్నీ ఒక తీరు..కార్గిల్ ఒక్కటే మరో తీరు. అప్పటికే రెండు దేశాలు సొంతంగా అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా ఉన్నాయి. అంతకు ముందు 1965, 1971 లో కూడా భారత్ పై దాడులు చేసి తోక ముడిచిన పాక్ 28 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ పై దాడికి యత్నించింది.ముందుగా పాకిస్తాన్ నుంచి రహస్యంగా ఎల్ ఓ సీ నియంత్రణ రేఖ గుండా పాక్ సరిహద్దులనుంచి భారత్ భూభాగానికి చేరుకున్నారు పాక్ సైనికులు. 1999 మేలో ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన పాక్ అక్కడే ఓ పర్వత ప్రాంతంలో సైనిక స్థావరాలతో తిష్ట వేశారు. అయితే కొందరు భారత దేశానికి చెందిన పశువుల కాపరులు ఈ విషయాన్ని భారత సైన్యానికి చేరవేశారు.


500 మంది భారత సైనికుల వీరమరణం

వచ్చింది పాక్ టెర్రరిస్టులని అనుకున్నారు ముందు. తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం వచ్చినవాళ్లు పాక్ సైన్యమే అని నిర్ణారణ చేసుకున్న భారత ఆర్మీ వారిని ధీటుగా ఎదుర్కునేందుకు సిద్ధపడింది. అప్పటి పాక్ ప్రధాని ముషారఫ్ తో ఒక పక్క శాంతి చర్చలు జరుపుతూనే మరో పక్క పాక్ సైన్యాన్ని ఎదుర్కున్నారు భారత సైన్యం. పాక్ దురాగతాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లి..ఆ దేశానికి ఏ ఒక్క దేశం సాయం చేయకుండా చేయడంలో భారత దౌత్య నీతి పలించింది. అయితే హోరాహోరీగా జరిగిన ఈ కార్గిల్ యుద్ధంలో భారత జవాన్లు 500కి పైగా మృతి చెందారు. అయినా భారత ఆర్మీ వెనక్కి తగ్గలేదు. పాక్ సైనికులు అక్కడినుంచి పారిపోయేలా చేశారు. ఎట్టకేలకు 1999 జులై 26న భారత త్రివర్ణ పతాకం ఎగురవేసి పాక్ సేనల భరతం పట్టారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన యుద్ధంగా కార్గిల్ వార్ మిగిలిపోయింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం అధికారికంగా కార్గిల్ విజయ్ దివస్ ను  యుద్ధంలో అమరులైన భారత సైనికుల గుర్తుగా జరుపుకుంటూ వస్తున్నాము. 25 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ భారతీయులు సగర్వంగా చెప్పుకుంటున్నారు కార్గిల్ యుద్ధం గురించి.

కార్గిల్ లో ప్రధాని మోదీ

ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ జమ్ముకాశ్మీర్ లోని కార్గిల్ ప్రాంతంలోని ద్రాస్ సెక్టార్ లో ఉన్న యుద్ధ వీరుల స్మారకాన్ని శుక్రవారం సందర్శించారు. నాటి యుద్ధంలో తమ ప్రాణాలను లెక్కచేయక శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజు ప్రతి భారతీయుడికి ప్రత్యేకమైన రోజు అని ఎక్స్ వేదికగా స్పందించారు. ఇవాళ చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు.మన దేశాన్ని రక్షించుకున్న ప్రతి ఒక్క సైనికునికీ నివాళులర్పించే రోజు. సైనికుల స్ఫూర్తి చరిత్రలో మిగిలిపోయిన రోజు. ఎప్పటికీ మర్చిపోలేని రోజు అన్నారు.

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×