Former Lok Sabha MPs get Eviction Notices: దేశ రాజధానిలో ప్రస్తుతం ఓ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. 200 మందికిపైగా ఎంపీలకు నోటీసులు వెళ్లాయంటా. ఇందుకు సంబంధించి పలు జాతీయ వార్తా కథనాల్లో వెల్లడవుతుంది. ఇంతమందికి ఒకేసారి నోటీసులు వెళ్లడం ఇదే మొదటిసారి అంటూ అందులో పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఎంపీలుగా ఎన్నికైన వారికి దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాలను కేటాయిస్తారు. గత పార్లమెంటు సభ్యులకు కూడా బంగ్లాలు కేటాయించారు. అయితే, ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు ఓటమి చెందారు. ఆ ఓటమి చెందిన ఎంపీలు గతంలో వారికి కేటాయించిన బంగ్లాలను ఇంకా ఖాళీ చేయలేదంటా. ఈ క్రమంలో 200 మందికి పైగా మాజీ పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు హౌస్ కమిటీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే ఖాళీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది.
Also Read: దోడా ఉగ్ర ఘటనపై రాహుల్ సీరియస్.. మీరే కారణమంటూ..
కాగా, ఇటీవలే ఎన్నికైన ఎంపీలకు, పలువురు మంత్రులకు ఇప్పటివరకు కూడా బంగ్లాలను కేటాయించలేదంటూ కూడా ఆ వార్తల్లో పేర్కొంటున్నారు. వారు ఖాళీ చేయకపోవడంతోనే బంగ్లాలు లేక వారికి కేటాయించలేదని, ఈ నేపథ్యంలోనే వారిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారంటూ ఆ వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ మీరు ఖాళీ చేయకపోతే సిబ్బంది వచ్చి బలవంతంగా ఖాళీ చేయాల్సి వస్తుంది అంటూ అందులో చెప్పారంటా.