EPAPER

Badlapur: రైల్వేట్రాక్‌ల‌పై స్థానికుల భారీ నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం

Badlapur: రైల్వేట్రాక్‌ల‌పై స్థానికుల భారీ నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం

Badlapur protest news today(Live tv news telugu): మహారాష్ట్రలోని థానెలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. బద్లాపుర్ లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో థానె నగరం పూర్తిగా స్తంభించింది. ఆందోళనకారులు రైల్వేట్రాక్ ల పైకి రావడంతో స్థానిక రైళ్లను నిలిపివేశారు. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్వీపర్ ను అదుపులోకి తీసుకున్నారు.


Also Read: లేటరల్ ఎంట్రీపై కేంద్రం వెనకడుగు.. ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందిగా యూపీఎస్సీకి ఆదేశం

బద్లాపుర్ లోని పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై ఒక స్వీపర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఓ బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాధిత బాలిక పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడింది. దీంతో ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారి నుంచి మొదట ఎటువంటి స్పందన రాలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణలో లొసుగులు కూడా బయటకు వచ్చాయి. బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని వెల్లడైంది. మరోవైపు పాఠశాలలో ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయడంలేదని తేలింది.


ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ట్రాక్ లపై ఆందోళనకారులు నిరసన చేస్తుండడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంల స్పందించిన బాలలల హక్కుల జాతీయ కమిషన్. దర్యాప్తు నిమిత్తం బద్లాపుర్ కు ఒక బృందాన్ని పంపేందుకు సిద్ధమయ్యింది.

Also Read: కోల్‌కతా ట్రైనీ హత్యాచార ఘటన.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారణం వ్యక్తం చేసింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసింది. క్లాస్ టీచర్, ఇద్దరు సిబ్బందిని కూడా తొలగించింది పాఠశాల యాజమాన్యం.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×