EPAPER

OTT Platforms Banned: ఓటీటీలు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా.. 18 ప్లాట్ ఫామ్ లు తొలగింపు!

OTT Platforms Banned: ఓటీటీలు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా.. 18 ప్లాట్ ఫామ్ లు తొలగింపు!

Central Banned 18 OTT Platforms


Central Government Banned 18 OTT Platforms: అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్ లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆయా ఓటీటీలకు, వెబ్ సైట్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా అవి ప్రసారం చేసే కంటెంట్ లో మార్పు రాకపోవడంతో వాటిని తొలగిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 18 ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, 19 వెబ్ సైట్ లు, 10 యాప్ లు, 57 సోషల్ మీడియా ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం తొలగించిన యాప్ లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నవి కాగా.. మరో మూడు యాపిల్ యాప్ స్టోర్ లో ఉన్నవి.

కేంద్రం తొలగించిన వాటిలో సోషల్ మీడియా ఖాతాలైన ఫేస్ బుక్ లో 12, ఇన్ స్టాగ్రామ్ లో 17, X లో 16, యూట్యూబ్ లో 12 ఉన్నట్లు తెలిపింది. రెండ్రోజుల క్రితం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. కాగా.. తాజాగా తొలగించిన ఓటీటీలకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్ కు సంబంధించిన ట్రైలర్, వెబ్ లింక్ లను చూపుతున్నాయని తెలిపారు.


Also Read: Mamata Banerjee Suffers Major Injury : బెంగాల్ సీఎం మమత తలకు తీవ్ర గాయం.. ఆస్పత్రికి తరలింపు..

ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ కు 32 లక్షల వ్యూస్ ఉన్నట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ ఓటీటీలపై అయినా చర్యలు తప్పకుండా ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం తొలగించిన వాటిలో dreams films, voovi, yesma, uncut adda, triflicks, X prime, neon X VIP, besharams, hunters, rabbit, xtramood, nuefliks, moodX, mojflix, hot shots VIP, Fugi, chikooflix, prime play ఉన్నాయి.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×