EPAPER

Bottle Gourd In Man’s Rectum| తీవ్రకడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన పేషంట్.. కడుపులో 16 అంగుళాల పొట్లకాయ చూసి డాక్టర్లు షాక్!

Bottle Gourd In Man’s Rectum| తీవ్రకడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన పేషంట్.. కడుపులో 16 అంగుళాల పొట్లకాయ చూసి డాక్టర్లు షాక్!

Bottle Gourd In Man’s Rectum| మధ్యప్రదేశ్ లోని ఛత్రపూర్ జిల్లా ఆస్పత్రికి ఓ ఏళ్ల వ్యక్తి తీవ్రకడుపునొప్పితో వచ్చాడు. డాక్టర్లు అతడి కడుపు ఎక్స్ రే రిపోర్ట్ చూసి షాకయ్యారు. అతని కడుపులో ఏదో పొడువైన వస్తువు.. మలద్వారం నుంచి కడుపు వరకు దాదాపు 1.5 అడుగుల పొడవు ఉంది. దీంతో డాక్టర్ల అతని కడుపుని సూక్ష్మంగా పరీక్షించారు. పేషంట్ మలద్వారం నుంచి కడుపు వరకు లోపలి కండరాలు దెబ్బతిన్నాయి. రక్త స్రావం కూడా జరుగుతోందని తేలింది.


రోగి పరిస్థితి విషమంగా ఉందని గమనించిన ఆస్పత్రి సీనియర్ సర్జన్, డాక్టర్ నంద్ కిషోర్ జాటవ్.. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ నంద్ కిషోర్ నేతృత్వంలో నలుగురు డాక్టర్ల బృందం.. రెండు గంటలపాటు కష్టపడి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తరువాత కడుపు లోపలి నుంచి బయటికి వచ్చిన వస్తువు చూసి మరోసారి ఆశ్చర్యపోయారు. ఆ వస్తవు ఒక సీసా పొట్లకాయ. దాని పొడవు 16 అంగుళాలు ఉంటుందని డాక్టర్లు తెలిపారు.


ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత డాక్టర్ నంద్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. పేషెంట్ ఒక రైతు అని.. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. పొట్లకాయ అతని మలద్వారం నుంచి కడుపు లోపలికి బలవంతంగా ఎవరైనా పెట్టారో? లేక ఏదైనా దుర్ఘటన వల్ల అలా జరిగిందో కచ్చితంగా చెప్పలేమన్నారు. పేషంట్ మలద్వారం నుంచి కడుపు వరకు వెళ్లే భాగం బాగా దెబ్బతిన్నదని.. ప్రస్తుతం పేషంట్ కోలుకుంటున్నాడని అన్నారు.

Also Read: రూ.500 ఇంటి రెంటు..దుర్భర జీవితం.. కలలు సాకారం చేసేందుకు జొమాటో బాయ్ పోరాటం

ఇలాంటిదే మరో ఘటన మార్చి నెలలో వియత్నాంలో జరిగింది. 34 ఏళ్ల ఓ వ్యక్తి కడుపునొప్పి అని ఆస్పత్రికి చేరుకోగా.. అతని కడుపులో సజీవంగా ఉన్న ఈల్ చేప ఉన్నట్లు తేలింది. ఆ వ్యక్తి నది సమీపంలో మల విసర్జనకు వెళ్లినప్పుడు ఈల్ చేప అతని మలద్వారం నుంచి అతని పెద్ద పేగులోకి ప్రవేశించినట్లు డాక్టర్ల నిర్ధారించారు. ఆ తరువాత డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ చేపను బయటికి తీశారు.

Actor Darshan: డిప్యూటీ సిఎంతో భేటీ అయిన నటుడు దర్శన్ భార్య.. డికె శివకుమార్ ఏం చెప్పారంటే?..

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×