Big Stories

Cheetah: భారత్‌కు చేరుకున్న మరో 12 చీతాలు..

Cheetah: దేశంలో అంతరించిపోయిన చీతాల జాతిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి చీతాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈప్రక్రియలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్ చేరుకున్నాయి. చీతాలతో శుక్రవారం సాయంత్రం సౌతాఫ్రికా నుంచి బయల్దేరిన విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ చేరుకుంది.

- Advertisement -

భారత్‌కు వచ్చిన చీతాల్లో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉన్నాయి. వాటిని గ్వాలియర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్యోపుర్‌కు తరలిస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలోకి చీతాలను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రి భూపేంద్ర యూదవ్ వాటిని విడుదల చేయనున్నారు. నెల రోజుల పాటు చీతాలను క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

- Advertisement -

కాగా, గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న స్వయంగా మోదీ ఆ చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News