EPAPER

Ambani’s son’s wedding: అయ్యబాబోయ్, అంబానీ కొడుకు పెళ్లికి అన్నికోట్లా.?

Ambani’s son’s wedding: అయ్యబాబోయ్, అంబానీ కొడుకు పెళ్లికి అన్నికోట్లా.?
all the crores for Ambani's son's wedding..?
 

1000 Crores for Ambani’s son’s wedding: ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, పారిశ్రామికవేత్త ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌, శైలా దంపతుల కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగవైభవంగా జరిపేందుకు సన్నద్ధం అవుతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఈ వేడుకలకు ముస్తాబైంది.ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు, సినీప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ హాజరవుతున్నారు. ఇందుకోసం ఎక్కడ ఏ లోటు లేకుండా ముఖేష్ అంబానీ భారీగానే ప్లాన్ చేశారు. వచ్చిన వారికి ఎప్పటికి గుర్తుండిపోయేలా అతిథులకు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.


ఇందులో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది పాప్‌ సింగర్‌ రిహన్న..ప్రపంచ పాప్‌ సింగర్‌లో ఒకరు.ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ షో చేయనున్నారు. నాలుగు గంటల పాటు తన సంగీతంతో నాలుగు గంటలపాటు అతిథులను మంత్రముగ్థులను చేయనున్నారు.ఇక అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్‌కి ప్రముఖుల రాకతో జామ్‌నగర్ అంతా సందడి వాతావరణం నెలకొంది. టీమీండియా మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ దంపతులు, క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అఫ్గాన్ క్రికెటర్ రషీద్‌ఖాన్, విండీస్ క్రికెటర్ బ్రావో, జహీర్‌ఖాన్ దంపతులు, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్​జామ్‌నగర్‌కు చేరుకున్నారు. అలాగే డీఎల్ఎఫ్‌ సీఈఓ కుశాల్‌ పాల్‌సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే ముఖ్య అధికారులు సైతం చేరుకున్నారు.

Read More: సందేశ్‌ఖాలీ కేసు వివాదం.. టీఎంసీపై పీఎం మోదీ ఫైర్‌..


ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ప్రముఖులు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్, ఈఎల్ రోత్‌స్‌చైల్డ్ చైర్ లిన్ ఫారెస్టర్ డి రోత్‌స్‌ చైల్డ్ ఉన్నారు. రిహన్నా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే జామ్‌నగర్‌లో ఉన్నారు. ఇంకా చాలామంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

ప్రీ వెడ్డింగ్ కోసమే ఇంత ఖర్చు పెడుతున్నాడంటే ఇక వారి పెళ్లి కోసం ఇంకెంత ఖర్చు పెడుతారో అంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. మరి అంబానీ ఇంట్లో పెళ్లంటే మినిమం ఉండకపోతే వారి స్థాయికి తక్కువే అవుతుంది కదా. ఇక ఇదిలా ఉంటే.. అనంత్‌ అంబానీ,రాధిక వివాహం జులైలో జరగనుంది. ఈ పెళ్లి కోసం కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఏకంగా రూ.1000 కోట్లను ఖర్చు చేయబోతున్నారట. అంటే ($120 మిలియన్లు) ఖర్చు చేయనున్నారన్న మాట. వామ్మో అన్ని కోట్లా అని మీరు షాక్ అవకండి. ఇంత డబ్బంటే మనకు భయమేమో కానీ, వారికి ఇదేమి అంత పెద్ద ఖర్చు కాదులేండి. ఏదేమైనా దీన్ని బట్టి చూస్తే డబ్బుంటే ఏదైనా సాధ్యమని తెలుస్తోంది.

Tags

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×