EPAPER

Life and Health care:ఈ రీల్స్ పిచ్చేంటి? ఇలా తయారవుతున్నారు జనం

Life and Health care:ఈ రీల్స్ పిచ్చేంటి? ఇలా తయారవుతున్నారు జనం

Youth makes Crazy reels by taking Dangerous vedios
పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇవాళ స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.కొందరికి అవి వినోద సాధకమైతే మరికొందరికి విజ్ణానదాయకం. టెక్నికల్ గా మనం డెవలప్ అవుతున్నామా లేక అంధకారంలోకి జారిపోతున్నామో అర్థం కాని పరస్థితి నెలకొంది. ప్రతి నిత్యం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ లేకుండా జీవన మనుగడ లేని పరిస్థితికి వచ్చేశాం. నెలల చిన్నారులనుంచి పండు ముసలివారు సైతం స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. మొదట్లో సినిమాలు, పాటలు ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. యూట్యూబర్స్ చేసే వింత విన్యాసాలు చూడటానికి, వాళ్లు ప్రాణాలకు తెగించి చేసే వీడియోలకు బాగానే కనెక్ట్ అయిపోతున్నాం. జనం చూస్తున్నారు..లైకులు కొడుతున్నారని కొందరు ప్రాణాలకు తెగించి పీకలమీదకు తెచ్చుకుంటున్నారు.


డమ్మీ తొపాకులతో హల్ చల్

తాజాగా ముగ్గురు యువకులు నిర్మల్ జిల్లా లో క్రేజీ రీల్స్ చేయాలనే ఉద్దేశంతో అర్థరాత్రి తుపాకులతో హల్ చల్ చేశారు.అయితే అవి డమ్మీ తొపాకులు. మొదట్లో రీల్స్ చేద్దామనుకుని జనం బెదిరిపోవడంతో వారి వద్ద నుంచి డబ్బులు కూడా దబాయించి తీసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు ఇదంతా రియాలిటీగా ఉండాలని వీడియో చిత్రీకరించారు.పోలీసులకు వీరి చర్యలపై కంప్లైంయింట్స్ కూడా వెళ్లాయి. దీనితో పోలీసులు వీరి చర్యలను రహస్యంగా ఛేదించారు. అదుపులోకి తీసుకున్నాక తెలిసింది వారు ఉపయోగించిన తొపాకులు డమ్మీవని. సరదాగా రీల్స్ కోసం చేశామని..పరిస్థితి అనుకూలించడంతో దోపిడీ లు చేశామని ఒప్పుకున్నారు.


పిచ్చి పీక్స్ కు చేరింది

ఇది కేవలం ఓ చిన్న సంఘటనే. దేశ వ్యాప్తంగా రీల్స్ పిచ్చి పీక్స్ కు చేరుకుంది. పెళ్లికి ముందు చేసే వెడ్డింగ్ షూట్ మామూలుగా చేస్తే కిక్కేముంటుంది అని ఏకంగా సముద్రాల మధ్య, భయానక కొండల మధ్య చేస్తున్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా వారి ప్రాణాలకే ముప్పు అని గ్రహించలేకపోతున్నారు. రోడ్డు మీద ఒకప్పుడు యాక్సిడెంట్ అయితే వెంటనే ఆ వ్యక్తికి సకాలంలో ట్రీట్ మెంట్ ఇప్పించి అతనిని కాపాడే ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు రోడ్డు మీద రక్తం కారుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని వీడియో చేస్తూ అతని చావు కేకలను రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

సోషల్ మీడియా వాడకంలో భారత్

ఇటీవల సోషల్ మీడియా వాడకంపై ఓ సర్వే సంస్థ ఇలా తెలియజేసింది..భారతీయులు యావరేజ్ న 194 నిమిషాలు సోషల్ మీడియాను వాడుకుంటున్నారని తెలిపింది. అంటే దాదాపు 3 గంటల పాటు చూస్తున్నారని తెలుస్తోంది. ఆన్ లైన్ గేములు, ఓటీటీలలో 44 నుంచి 46 నిమిషాలు కేటాయిస్తున్నారని తెలిపింది. 28 శాతం మంది స్మార్ట్ టీవీలు, హోమ్ థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా వాడకందారుల సంఖ్య మరింతగా పెరుగుతుందని చెబుతోంది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకోబోయే దాకా స్మార్ట్ ఫోన్ల మాయలో పడి బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. ప్రతి రోజూ మన ఆఫీసుల్లో పనులు చేసి అలసిపోయినా ఇంటికి వచ్చి కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా టైమ్ ఉండదు. ఒక్కో కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురూ స్మార్ట్ ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు దూరం అవుతున్నామన్న సంగతి గ్రహించడం లేదు. తెలివైన వ్యాపారులు మాత్రం తాము చూపించే కంటెంట్ ఆధారంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు. తెలివిలేని వారు మాత్రం వీటికి బానిసలవుతున్నారు.

Tags

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×