EPAPER

Goat Brain: బేజా.. అదేనండి మేక మెదడు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Goat Brain: బేజా.. అదేనండి మేక మెదడు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

బేజా ఫ్రై పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. మేక లేదా గొర్రె మెదడును వేయించుకుని తింటారు… అదే బేజా ఫ్రై. ఇది మన దేశంలో రుచికరమైన వంటకాల్లో ఒకటి. చాలామందికి బేజాను కేవలం రుచి కోసమే తినాలేమో అనుకుంటారు. నిజానికి మేకం మెదడును వేయించుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


మేక మెదడులో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకాలతో నిండి ఉన్న ఆహారం. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ రోగులు కూడా బేజా ఫ్రై ను తినవచ్చు. దీని నుంచి వచ్చే వాసన కాస్త లోహ రుచిని కలిగి ఉంటుంది. మీకు అది నచ్చకపోతే మంచిగా సుగంధ ద్రవ్యాలు మసాలాలు దట్టించి వేయించుకోవచ్చు.

కాకపోతే బేజా లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక సంతృప్త కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటుంది. అందుకే దీన్ని చాలా తక్కువగా తీసుకోవాలి. మీకు అధిక కొలెస్ట్రాల్, బీపీ వంటి సమస్యలు ఉంటే ఈ బేజాఫ్రైకు దూరంగా ఉండటమే మంచిది.


అధిక కొలెస్ట్రాల్ సమస్య లేనివారు, అధిక బీపీతో బాధపడని వారు… అప్పుడప్పుడు మేక మెదడును ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. దీనిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా నిండి ఉంటాయి. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఫ్రాన్స్ లో గొర్రె మెదడును సెర్వెల్ అని పిలుస్తారు. అక్కడ రుచికరమైన వంటకాలలో ఇది ఒకటి. ఖరీదైనది కూడా. దీన్ని బటర్ లో డీప్ ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు. అధిక కొలెస్ట్రాల్ సమస్య లేకపోతే మీరు కూడా అప్పుడప్పుడు బేజాను తినవచ్చు.

Also Read: ఆలూ బిర్యాని ఇలా చేశారంటే పావుగంటలో రెడీ అయిపోతుంది, వేడివేడిగా తినేయొచ్చు రెసిపీ ఇదిగో

దక్షిణ భారత దేశంలో అధికంగా మేక మెదడును ఆహారంగా భాగంగా తింటారు. ముంబైలో కూడా కొన్ని చోట్ల ఈ బ్రెయిన్ మసాలా కూరలా వండి తింటూ ఉంటారు. మేక మెదడు కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. వంట చేయడానికి ముందు మేక మొదడును పరిశుభ్రంగా కడిగి అప్పుడే దాన్ని వండాలి. కొన్ని అవయవాలు టాక్సిన్ లను కలిగి ఉంటాయి. అదృష్టవశాత్తు మేక మెదడులో ఎలాంటి విషాలు ఉండవు. ఇది తినేందుకు పూర్తి సురక్షితమైనది.

Related News

Yoga For Eye Sight: ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు

Pomegranate Peel Face Pack: ఈ ఫేస్ ప్యాక్ వాడితే మేకప్‌తో లేకుండానే మెరిసిపోతారు

Rose Cream: మెరిసే చర్మం కోసం.. గులాబీలతో ఫేస్ క్రీమ్

Daily Skin Care: డైలీ ఇలా ఫేస్ క్లీన్ చేసుకుంటే.. మీ అందం రెట్టింపు

Kiwi Fruit: ఈ ఫ్రూట్‌ విటమిన్ సి యొక్క పవర్ హౌజ్.. తింటే చెప్పలేనన్ని లాభాలు

Memory Increase: మతిమరుపు ఎలా మొదలవుతుంది ? ఎప్పుడు జాగ్రత్త పడాలి

Big Stories

×