EPAPER

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Yoga For Stress Release: శతాబ్దాలుగా చాలా మంది యోగాసనాలను అభ్యసిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో యోగా ప్రారంభం అయినట్లు ఆధారాలు ఉన్నాయి. యోగాసనాలు మన శరీరంలోని వ్యాధులను దూరం చేస్తాయి. వివిధ రకాల యోగాసనాలను చేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇదిలా ఉంటే కొన్ని యోగాసనాలు ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.


మీకు చిరాకుగా అనిపించానా లేదా చిన్న విషయాలపై ఒత్తిడికి గురైనా కూడా 5 యోగాసనాలు చేయండి. ఈ యోగాసనాలను చేయడం వల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ 5 యోగాసనాలు ఒత్తిడి లేకుండా చేస్తాయి.

అనులోమ్ విలోమ్ ప్రాణాయామం:


ఈ యోగాసనం చేయడానికి ముందుగా కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకోవాలి. తర్వాత ఎడమ నాసికా రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకోవాలి. ఎడమ నాసికా రంధ్రము ద్వారా గాలి పీల్చినపుడు కుడి నాసికా రంధ్రము ద్వారా గాలిని వదలాలి. కుడి నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చినప్పుడు ఎడమ నాసికా రంధ్రం ద్వారా స్వాస వదలాలి. ఇలా 5 నిమిషాల పాటు చేయాలి. ఈ ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది .

త్రికోణాసనం:
ఈ ఆసనం శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. రెండు కాళ్లను విస్తరించడం ద్వారా ఈ యోగాసనాన్ని చేయవచ్చు. కుడి కాలును 90 డిగ్రీలు వంచి ఎడమ కాలు నిటారుగా ఉంచాలి. కుడి చేతిని నేలపై ఉంచి, ఎడమ చేతిని పైకి కదిలించండి. ఈ విధంగా కొన్ని సెకన్ల పాటు ఉండండి. ఇలాగే మరొక వైపు పునరావృతం కూడా చేయండి.

భుజంగాసనం (కోబ్రా పోజ్):

ఈ ఆసనం వెన్నునొప్పిని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ యోగాసనం చేయడానికి బోర్లా పడుకోండి. తర్వాత మీ చేతులను మీ భుజాల క్రింద ఉంచండి. నెమ్మదిగా నడుముని పైకి లేపండి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. ఆపై తిరిగి యథాస్థానానికి రండి.

శవాసనం:

ముందుగా మీ వెల్లికిలా నేలపై పడుకోండి. తర్వాత కళ్ళు మూసుకుని నిదానంగా గాలి పీల్చి వదలండి. శరీరంలోని ప్రతి భాగాన్ని రిలాక్స్ చేయండి. ఈ ఆసనం శరీరానికి, మనసుకు పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. అంతే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

Also Read: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

చంద్రాసనం:

వజ్రాసనంలో కూర్చోవడమే చంద్రాసనం. వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకుని నిదానంగా గాలి పీల్చి వదలండి. తర్వాత మీ నాభిపై దృష్టి పెట్టండి. ఈ ఆసనం మనస్సును ప్రశాంతపరుస్తుంది . అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. తరుచుగా ఈ యోగాసనాలు  చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, అంతే కాకుండా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము.

జాగ్రత్త వహించండి..

యోగా చేసే ముందు యోగా నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.
ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన వెంటనే యోగా చేయకూడదు.
యోగా చేసేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Big Stories

×