EPAPER
Kirrak Couples Episode 1

Winter Food: చలి నుంచి కాపాడుకునే ఆహార పదార్థాలు ఇవే

Winter Food: చలి నుంచి కాపాడుకునే ఆహార పదార్థాలు ఇవే

Winter Food : దేశంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం పూట బయటకు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఈ సీజన్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు టీ, కాఫీ, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి వేడి వేడి ఐటమ్స్ ఎక్కువగా లాగించేస్తున్నారు. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, అలాగే శరీరం వెచ్చగా ఉండటానికి కొన్ని పదార్థాలు తింటే ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. సజ్జలు… ఇవి చిరుధాన్యాల జాతికి చెందినవి. కొన్ని ప్రాంతాల్లో సజ్జ పిండితో రొట్టెలు చేసుకొని ఆహారంగా తీసుకుంటారు. ఈ సజ్జల్లో ఐరన్, ప్రోటీన్ , కొవ్వు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. చలికాలంలో ఈ సజ్జ రొట్టె లేదా గంజిని తాగడం వల్ల శరీరానికి పోషకాలతో పాటు వెచ్చదనం కూడా అందుతుంది. ఈ సజ్జలు రక్తహీనతకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతాయి. అంతేకాకుండా చలిని తట్టుకునేందుకు కూరగాయలతో సూప్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఆహారంలో ముల్లంగి, చిలకడదుంప వంటివి ఉండేలా చూసుకోవాలి. స్వీట్ పొటాటోలో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. మలబద్ధకాన్ని నివారించడంలో ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె బాగా ఉంటాయి. క్రమం తప్పకుండా ముల్లంగిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే బ్రోకోలి, బీన్స్, పుట్టగొడుగులు, క్యారెట్‌లను కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఖర్జూరాలను తరచూ తినాలి. ఈ ఖర్జూరాల్లో మినరల్, విటమిన్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా శీతాకాలంలో చలి బారి నుంచి మనల్ని కాపాడుతాయి. ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు లాంటి దినుసులను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి ఎన్నో వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ప్రతి ఆహారంలో అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు, జీరా లాంటి దినుసులు వేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చీజ్, గుడ్లు చేపలను తినాలి. వీటిలో ఉండే విటమిన్ బి12, ప్రోటీన్స్ మనల్ని రక్షిస్తాయి. కూరలను చీజ్‌తో చేసుకోవడం ద్వారా రుచితో పాటు శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందుతాయి.


Related News

Egg Curry Recipe: కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ.. బిర్యానీకి జతగా టేస్ట్ అదిరిపోతుంది..

Protein Rich Food: ఈ 5 పదార్థాల్లో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్

Black Nose: ముక్కు నల్లగా మారిపోయిందా? అయితే మీకు ఆ వ్యాధి వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Besan For Skin Glow: శనగపిండితో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం

Potato Stuffed Egg Bonda: పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ, ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్ స్నాక్

Health Tips: పని, వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోతున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Skin Care Tips: ఈ టిప్స్‌తో న్యాచురల్‌గా మెరిసిసోతారు

Big Stories

×