EPAPER

Avoid Pillow : దిండుకు గుడ్‌బై చెప్పు..!

Avoid Pillow : దిండుకు గుడ్‌బై చెప్పు..!

Sleep Without Pillow: మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన నిద్ర లేకుంటే ఆ రోజు ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. అయితే నిద్రపోయే సమయంలో మనం చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటాము. ఇవి చిన్న పొరపాట్లే కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. హాయిగా నిద్రపోయేందుకు మనం చాలా రకాల పద్దతులను అనుసరిస్తూ ఉంటాం. అందులో కొందరు దిండు లేకుండా పడుకుంటే.. మరి కొందరు దిండు పెట్టుకొని నిద్రపోతారు. ఇక్కడే పెద్ద సమస్య ఉంది. దిండు పెట్టుకొని నిద్రపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యం చేయకుండా.. అవేంటో చూసేద్దాం.


కొందరికి దిండ్లంటే మహా ఇష్టం. అందులోనూ అవి మెత్తనివైతే.. కళ్లు మూసి ఓ కునుకు వేయాలనిపిస్తుంది. ఎందుకంటే అవి ప్రశాంతమైన నిద్రను అందిస్తాయోమో కానీ ఆరోగ్యకరమైన నిద్ర అయితే కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దిండు లేకుండా నిద్రపోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Read More : కడుపులో క్రిములా..?


దిండును పెట్టుకుని నిద్రపోవడం వల్ల మీ ముఖం దిండుకు అంటుకుని ఉంటుంది. దిండుపై ఉండే బ్యాక్టీరియా, మురికి మీ ముఖానికి అంటుకుంటాయి. దీని కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల ముఖంపై మొటిమలు రాకుండా నివారించొచ్చు. ముఖంపై ముడతలకు కూడా వస్తాయి. చర్మాన్ని సంరక్షించుకోవాలంటే దిండు లేకుండా నిద్రపోండి.

మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే దిండును పెట్టుకొని నిద్రపోవడం మానేయండి. మీ వెన్నునొప్పకి ప్రధాన కారణం దిండుగా గుర్తించండి. దిండు పెట్టుకొని నిద్రపోవడం వల్ల వెన్నుపూస పక్కకు వాలుతుంది. తల కింద దిండు ఉండటం వల్ల వెన్నెముక మీద ప్రభావం చూపుతుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ వెన్నుపూస నిటారుగా ఉంటుంది.

దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ నిద్ర ఆరోగ్యకరంగా ఉంటుంది. దీనిని అనేక అధ్యయనాలు కూడా ధృవీకరించాయి. దిండు లేకుండా నిద్రపోతే మీ మెడ, వీపు ఆరోగ్యంగా ఉంటాయి. నిద్రలేమితో బాధపడేవారు దిండు లేకుండా నిద్రపోతే ఆ సమస్యకు గుడ్‌బై చెప్పొచ్చు.

Read More : రోజుకో గుడ్డును గుటుక్కున మింగేయండి..!

నిద్రపోయేప్పుడు చాలా మంది రకరకాల భంగిమలో పడుకుంటారు. ఇది మీ మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. నిద్ర రావడం లేదనే ఆలోచనలు రావడానికి ఇదే కారణం. దిండు లేకుండా పడకోవడం వల్ల మీ ఒత్తిడి స్థాయి తగ్గుతుంది.

మీ పిల్లలకు దిండపై నిద్రపోవడం అలవాటు చేయకండి. ఇది ఫ్లాడ్ హెడ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు. దీని వల్ల తల ఒకవైపు వంగినట్లుగా కనిపిస్తుంది. శిశువుల తల చాలా మృదువుగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ సేపు దిండుపై నిద్రిస్తే మెడ బెణుకు వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు ప్రత్యేకంగా కొన్ని దిండులు బయట అందుబాటులో ఉన్నాయి. వాటితో ఎటువంటి సమస్య ఉండదు.

చాలా మందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. ఎక్కువకాలం దిండు మార్చకుండా, దిండు కవర్లు శభ్రం చేయకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవ్వొచ్చు. మీ గదిలో బ్యాక్టీరీయా ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దిండు కూడా ఒకటని గుర్తుంచుకోండి. దిండుపై పడుకొని శ్వాస తీసుకున్నప్పుడు దిండుపై ఉండే బ్యక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది మీ అలర్జీని ఎక్కువ చేస్తుంది. కాబట్టి దిండును పక్కనబెట్టండి.. ఆరోగ్యంగా జీవించండి.

Disclaimer : ఈ సమచారం కేవలం మీ అవగాహన కోసం వైద్యుల సూచనల మేరకు పేర్కొనబడింది.

Related News

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Figs Side Effects: ఆరోగ్యానికి మంచిది అని అంజీర పండ్లను అతిగా తినేస్తున్నారా ?

Chia Seeds Benefits for Skin: చియా సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×