EPAPER

Mosquitoes Bite: దోమలు కొంత మందినే ఎందుకు కుడతాయి..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

Mosquitoes Bite: దోమలు కొంత మందినే ఎందుకు కుడతాయి..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

Mosquitoes Bite: వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు విపరీతంగా పెరిగిపోతాయి. మురుగు నీరు చేరుకుని ఎక్కడ పడితే అక్కడ కాలుష్యం, చెత్తా, చెదారం కారణంగా దోమలు వ్యాపిస్తుంటాయి. ఎక్కువగా ఈ పరిస్థితి వర్షాకాలం మాత్రమే ఎదురవుతుంది. దీంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి చాలా రకాల వ్యాధులు సోకుతుంటాయి. అయితే దోమలు సాధారణంగా అందరినీ కుట్టవు. కొంతమందిని మాత్రమే దోమలు కుడుతుంటాయి. అయితే దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని బ్లడ్ గ్రూప్‌ల వారికే దోమలు కుడతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయని చెబుతున్నారు.


దోమలలో కూడా రెండు రకాల దోమలు ఉంటాయి. ఆడ దోమ, మగ దోమ అని రెండు విధాలుగా ఉంటాయి. వీటిలో మగ దోమలు పువ్వుల నుండి తేనెలు తీసుకుంటే, ఆడ దోమలు మాత్రం మనుషుల రక్తాన్ని తాగుతుంటాయి. దోమలు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. దీని కోసం మనుషుల రక్తం తాగి ప్రోటీన్లను తీసుకుంటాయి. దోమలు కుట్టే సమయంలో మనుషుల శరీరంలోకి వాటి లాలాజలాన్ని వదులుతాయి. దీని కారణంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి వ్యాధులు తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయింది.

దోమలు కొందరిని మాత్రమే ఎక్కువగా కుడుతుంటాయి. దీనికి గల కారణంగా మనం ధరించే బట్టలే. లేత రంగుల కంటే ముదురు రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్ల దోమలు ముదురు రంగు బట్టలు ధరించిన వారిని ఎక్కువగా కుడుతుంటాయి. అందువల్ల హాఫ్ స్లీవ్ బట్టలు ధరించడం మానుకోవాలి. వర్షాకాలం ముగిసే వరకు శరీరానికి నిండుగా ఉండే బట్టలు ధరించడం వల్ల దోమలు కుట్టడం నుంచి ఉపశమనం పొందుతారు. దోమల్లో చాలా రకాల జాతులు ఉంటాయి. ఇందులో కొన్ని దోమలు సాధారణంగా ఉంటే, మరికొన్ని మాత్రం విషపూరితమైనది అయి ఉంటాయి. వీటి వల్లే వ్యాధులు వ్యాపిస్తుంటాయి. మరోవైపు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వారికి దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు.


(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×