EPAPER

Cataracts : కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి..?

Cataracts : కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి..?

Cataracts Treatment : వయసు పెరిగే కొద్ది కొన్ని రకాల ఆనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో కళ్ల సమస్య కూడా ఒకటి. వృద్ధ వయసులో చూపుకుపట్టే గ్రహణాన్నే శుక్లం అంటారు. దీనికి మందులు లేవు. సర్జరితోనే దీనికి పరిష్కారం. కంటి శుక్లం ఆపేరేషన్ చాలా కష్టమైనది. చిన్న పొరపాటు జరిగినా రోగులు చూపును కోల్పేయే ప్రామాదం ఉంటుంది.


మీకు 60 కంటే వయసు ఎక్కువగా ఉంటే ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈ శుక్లం పరీక్షలు చాలా సులభం ఎటువంటి నొప్పి ఉండదు. ముందుగా కళ్లలో కొన్ని చుక్కల మందు వేస్తారు. అప్పుడు కళ్లు స్పష్టంగా తెరుచుకుంటాయి. తర్వాత కంటికి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కంటి శుక్లాన్ని ఎలా గుర్తించాలి? దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

Read More : మీ ఆరోగ్యం.. మీ గోళ్ల రంగు చెప్పేస్తుంది..!


అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్తమాలజీ ప్రకారం.. మన కళ్లు సహజసిద్ధమైన లెన్స్‌ను కలిగి ఉంటాయి. కంటి బాహ్య పొర అయిన రెటీనా చాలా సున్నితంగా ఉంటుంది. రెటీనా కాంతి పడినప్పుడు స్పందిస్తుంది. కంటిలోని ఈ సహజమైన్ లెన్స్‌లు కంటిపై పడే కాంతిని ప్రతిబింబించడం ద్వారా స్పష్టంగా చూడగలుగుతాము. కాబట్టి ఈ లెన్స్ శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం.

సాధారణంగా వయసుతో పాటు కంటిలో శుక్లాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో కళ్లలో వచ్చే మార్పలు కారణంగా కంటి శుక్లాలు వస్తాయి. కంటి శుక్లం వస్తే కంటి లెన్స్‌లోని ఫైబర్‌లు తెల్లగా మారతాయి. ఇలా మారడం వల్ల చూపు మసకబారుతుంది.

Read More : పాలు తాగే ముందు.. ఇవి తెలుసుకోండి..!

కంటి శుక్లం ప్రారంభంలో పెద్ద సమస్య ఉండదు. మొదట్లో ఇది లెన్స్‌పై కొంత భాగంపై మాత్రమే ప్రభావం చూపుతోంది. కానీ రోజులు గడిచే కొద్ది క్రమంగా పెరిగి లెన్స్ పూర్తిగా ప్రభావితమవుతుంది. అది చూపుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కంటిచూపు బూదరగా మారుతుంది.

కంటి శుక్లాలకు కారణాలు

కాంజెనిటల్

కొందరి శిశువులకు పుట్టకతో కూడా వచ్చే ప్రమాదం ఉంది. వారిలో కొంతకాలం తర్వాత చూపు సమస్య మొదలవుతుంది. కానీ కొందరికి పుట్టకతో వచ్చే శుక్లాల వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఏదేమైనా వాటిని కచ్చితంగా తొలగించాల్సి ఉంటుంది.

సెకండరీ క్యాటరాక్ట్

ఇతర వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఈ సెకండరీ క్యాటరాక్ట్ వస్తుంది. స్టెరాయిడ్ల వాడకం, డయాబెటిస్ వంటి వ్యాధులు దీనికి కారణం కావచ్చు.

ట్రామాటిక్ క్యాటరాక్ట్

కంటిలో ఏర్పడే గాయాలు వల్ల ఒకటి లేదా రెండు కళ్లలో శుక్లాలు రావచ్చు. ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు శుక్లాలు రావడం ప్రారంభమవుతుంది.

కంటి శుక్లం లక్షణాలు

  • వస్తువు బూదరబూదరగా కనిపిస్తుంది
  • చూపు మసకబారుతుంది
  • వెలుతురును చూడలేరు
  • ఎదుటి వారి ముఖాలను గుర్తించలేము
  • కళ్లు సున్నితంగా అనిపిస్తాయి
  • చూసేవన్నీ లేత పసుపు రంగులో కనిపిస్తాయి

ఆపరేషన్ ఎలా చేస్తారు..?

కంటి శుక్లం మూడు రకాలుగా ఉంటుంది. లెన్స్ మధ్యలో ఏర్పడే కంటిశుక్లం మొదటి రకం. లెన్స్‌కు వెనక భాగంలో ఏర్పడేది రెండో రకం. కంటి బయటి పొరలో ఏర్పడేది మూడో రకం.

కంటి శుక్లం ఆపరేషన్‌లో శుక్లాన్ని తొలగించి, కృత్రిమ లెన్స్ అమర్చేందుకు కార్నియా అంచున చిన్నకోత చేస్తారు. కృత్రిమ లెన్స్‌ను ఇంట్రాకోక్యులర్ లెన్స్ అంటారు. చెప్పాలంటే.. ఒక చిన్న బంతి లాంటి దానిని కంటి లోపలికి పంపుతారు. ఆ బంతి లోపల కదులుతూ..అల్ట్రాసౌండ్ తరంగాలతో శుక్లాన్ని విచ్ఛిన్నం చేసి ద్రవరూపంలోకి మారుస్తుంది. దానిని చిన్న రంధ్రం ద్వారా ఒక ఫోల్డబుల్ లెన్స్‌ను లోపలికి ప్రవేశపెడతారు. ఇది మునుపటి లెన్స్‌ స్థానాన్ని భర్తీ చేస్తుంది. రోగి కంటి అవసరాలకు అనుగుణంగా లెన్స్ అమర్చుతారు.

Disclaimer : ఈ కథనాన్ని పలు అధ్యాయనాలు, హల్త్ జర్నల్స్ ఆధారంగా అందించాము.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×