EPAPER

Cycling Vs Running: సైక్లింగ్, రన్నింగ్.. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ?

Cycling Vs Running: సైక్లింగ్, రన్నింగ్.. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ?


Cycling Vs Running: శరీర బరువు తగ్గడానికి లేదా ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ రెండింటిని క్రమం తప్పకుండా శ్రద్ధతో చేస్తే గుండె సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలను చెక్ పెట్టాలంలే జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని.. రన్నింగ్ లేదా సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి, కండరాలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు. ఈ రెండు కూడా మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. అయితే ఈ రెండింటింలో ఏది బెటర్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

సైక్లింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు హార్వర్డ్ యునీవర్సిటీ చేసిన పరిశోధనలో తేలింది. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉన్న ఒక మనిషి 30 నిమిషాలు గంటకు 5 మీటర్ల వేగంతో రన్నింగ్ చేస్తే 288 కేలరీలు తగ్గుతాడని తేలింది. అదే సైక్లింగ్ చేస్తే 30 నిమిషాలలో 19.3 నుంచి 22.3 మీటర్ల వేగంతో సైక్లింగ్ చేయాలట. వేగం పెంచే కొద్ది శరీరంలోని కేలరీలను ఖర్చు చేయవచ్చట. ఇలా బరువు తగ్గాలనుకునే వారు ఏదో ఒక దానిని ఎంచుకుని ప్రయత్నించాలి. అయితే ఇందులో రన్నింగ్ చేయడం చాలా మంచిది అని వైద్యులు చెబుతున్నారు.


శరీర కండారలను బలపరిచేందుకు రన్నింగ్ చాలా ఉపయోగపడుతుందట. అందులో బడ్జెట్ ఫ్రెండ్లీది ఎంచుకోవాలి అనుకుంటే రన్నింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే రన్నింగ్ చేయాలంటే కేవలం షూస్ మాత్రం ఉంటే సరిపోతుంది. అదే సైక్లింగ్ చేయాలంటే మాత్రం సైకిల్ ట్రాక్, షూస్, హెల్మెట్,
సాక్స్ వంటి తదితర వస్తువులు కొనాల్సి ఉంటుంది. అందువల్ల రన్నింగ్ ఆరోగ్యంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి రన్నింగ్ ను ఎంచుకోవడం ఉత్తమం.

ఈ రెండు కూడా ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ చేసే పనులే. శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందిస్తూ ఉత్సాహంగా దూసుకుపోతుంటాం. అయితే రెండు ఎరోబిక్ వ్యాయామాలే, కేలరీలు ఖర్చు చేస్తాం, కండరాల సామర్థ్యం పెంచుకుంటాం. అయితే రోజువారి పనిలో భాగంగా సైక్లింగ్ ను చేసుకోగలం. అదే రన్నింగ్ అయితే మాత్రం దానికి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. అందువల్ల సైక్లింగ్ బెటర్ అని, రెండింటితో ఏది ఎంచుకున్నా గుండె సమస్యలకు మాత్రం చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×