EPAPER

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Fashion Tips: భారతీయ మహిళల అందం చీరలో రెట్టింపు అవుతుంది. చీరలు మహిళలకు చాలా ఇష్టమైనవి. అకేషన్ ఏదైనా చీర కట్టుకుంటే ఆ లుక్కే వేరు. అందులో పట్టు సారీస్ రాయల్‌గా కనిపించేలా చేస్తాయి. సందర్భం ఏదైనా సరే, బాలీవుడ్ సెలబ్రిటీల నుండి సామాన్య మహిళల వరకు అందరూ చీర కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు.


చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, చీర అన్ని వయసుల వారికే కాదు అన్ని శరీర రకాలకు సరిపోతుంది. కానీ కొన్ని రంగుల చీరలు కొంత మందిని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. రంగు రంగుల చీరలు మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంన్నాయి. కానీ స్కిన్ టోన్ ప్రకారం చీర కట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. సాధారణంగా భారతీయులు గోధుమ రంగు అంటే మధ్యస్థ చర్మపు రంగులో ఉంటారు. అందుకే మీడియం స్కిన్ టోన్ ఉన్న మహిళలకు ఏ రంగు చీర ఎక్కువగా సూట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మస్టర్డ్ ఎల్లో కలర్ :
మస్టర్డ్ ఎల్లో కలర్ చీర మీడియం స్కిన్ టోన్ ఉన్న మహిళలకు చాలా బాగుంటుంది. ఈ రంగు పసుపు రంగుకు చెందినది. మీరు పసుపు రంగు చీరకు నలుపు బ్లౌజ్‌ను పెయిరప్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా, మీరు చీర అంచు యొక్క రంగును బట్టి మీ బ్లౌజ్‌ని కూడా ఎంచుకోవచ్చు. దీంతో చీర లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


సీ గ్రీన్ లేదా లేత ఆకుపచ్చ:
మీడియం స్కిన్ టోన్ ఉన్న మహిళలకు సీ గ్రీన్ లేదా లేత ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. సీ గ్రీన్ కలర్ చీరను ఆఫీస్ వేర్‌గా కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ సారీతో ఏదైనా మ్యాచింగ్ కలర్ బ్లౌజ్‌ని ధరించవచ్చు. ఈ రంగు చీరను కట్టుకున్నప్పుడు హెయిర్ లీవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీంతో మీరు మరింత అందంగా కనిపిస్తుంది.

రెడ్ కలర్ చీర:
మీడియం స్కిన్ టోన్ ఉన్న మహిళలు కూడా రెడ్ కలర్ చీర కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మంచి లుక్ కావాలనుకుంటే మాత్రం ఎక్కువ జ్యువలరీతో ఎరుపు రంగు చీరను కట్టుకోవచ్చు. ఈ కలర్ చీరతో మీ ట్రెడిషనల్ లుక్ అందరినీ ఆకర్షిస్తుంది.

Also Read: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

బ్లూ కలర్ చీర:
మీడియం స్కిన్ టోన్ ఉన్న మహిళలు కూడా బ్లూ కలర్ చీరను ధరించవచ్చు. ఈ రంగు చీరలు మీడియం స్కిన్ టోన్‌ వారికి చాలా బాగుంటాయి. మీకు కావాలంటే, ప్లెయిన్ లేదా బార్డర్డ్ బ్లూ కలర్ చీరను ఎంచుకోండి. మీరు మ్యాచింగ్ బ్లౌజ్ లేదా సిల్వర్ లేదా గోల్డెన్ బార్డర్ డిజైన్ ఉన్న బ్లౌజ్‌తో దీనిని ధరించవచ్చు. మీకు స్టైలిష్ లుక్ కావాలంటే కాస్త మేకప్, జ్యువెలరీని వేసుకోండి. ఇందులో మీరు ఫ్యాషన్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తారు. అంతే కాకుండా అందంగా కనిపించాలంటే మీడియం స్కిన్ టోన్ ఉన్న వారు ఈ టిప్స్ ఫాలో అవ్వడం ముఖ్యం.

Tags

Related News

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్లేట్ లెట్స్ కౌంట్ రెట్టింపు

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మీకు అబద్ధం చెబుతున్నా, మోసం చేస్తున్నా తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ టిప్స్ పాటించండి

×