EPAPER

Morning Mood : మీ మూడ్ అస్సలు బాగోలేదా.. ఇలా సెట్ చేయండి!

Morning Mood : మీ మూడ్ అస్సలు బాగోలేదా.. ఇలా సెట్ చేయండి!

Morning Mood


Morning Mood Boosting Tips : అప్పుడప్పుడు ఉదయం మూడ్ అసలు బాగోదు. గుడ్ మార్నింగ్ కాస్త బాడ్ మార్నింగ్‌‌లా అనిపిస్తుంది. చికాకుగా ఉంటుంది. ఎవరైనా జోక్స్ వేసిన కోపం వస్తుంది. ఏ పని చేయాలని అనిపించదు. రోజూవారీ ఒత్తిళ్లు, సరైన నిద్రలేకపోవడం, ఒకేరకమైన పని లేదా పనిచేసే చోట మంచి హెల్దీ వాతావరణం లేకపోవడం వంటి సంఘటనలు మీ మూడ్ చెడగొట్టవచ్చు.

అయితే ఇదే పరిస్థితి వారాల తరబడి ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఉదయం నుంచే మీ మూడ్ బాలేకుంటే ఆ రోజంతా మీరు ఏపని చురుకుగా చేయలేరు. కాబట్టి మీరు రోజంతా హుషారుగా ఉండాలంటే ఉదయాన్నే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


Read More : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే మంచిది.. సైన్స్ ఏం చెబుతుంది..!

మీ జీర్ణక్రియ

మీ మానసిక స్థితిని మీ జీర్ణక్రియ నిర్ణయిస్తుంది. జీర్ణకోశంలో ఉండే సూక్ష్మజీవులు(గట్ మైక్రొబయోం) మన పుట్టుక నుంచే తల్లిపాలు, జన్యు సంబంధమైన కారణాల వల్ల ప్రభావితం అవుతాయి. ఇవి రోగ నిరోధక శక్తికి, జీర్ణ వ్యవస్థకు, మెదడుపై ప్రభావం చూపుతాయి. జీర్ణక్రియలో పాల్గొనే సూక్ష్మజీవులు తగ్గినపుడు మనల్ని హుషారుగా ఉంచటంలో ప్రధాన పాత్ర పోషించే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

మార్నింగ్ రొటీన్

మీరు మీ రోజుకు ఏ మూడ్‌తో ప్రారంభిస్తారో దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. రోజును హడావిడిగా మొదలుపెడితే.. శరీరంలో ఒత్తిడి పెంచే కార్టిసోల్ అనే హార్మోన్ అధిక మొత్తంలో రిలీజ్ అవుతుంది. మార్నింగ్ ఫోన్ చెక్ చేసుకోవటం, సోషల్ మీడియాతో టైమ్ గడపడం వల్ల ఇలా జరగొచ్చు. శరీరాన్ని లేదా మనసును ప్రశాంతంగా ఉంచే యోగా, మెడిటేషన్ లాంటి వాటితో మీ రోజును ప్రారంభించండి.

సూర్యరశ్మిని పొందండి

మీ శరీరంపై ఉదయాన్నే సూర్యకాంతి పడేలా చూడండి. దీనివల్ల మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది డిప్రెషన్‌ను నివారిస్తుంది. అయితే ఎక్కువసేపు ఎండలో ఉండకండి. ఎండ తక్కువగా ఉన్నప్పుడు.. వెచ్చని లేత సూర్య కిరణాలు మీ శరీరాన్ని తాకేలా ఒక 10-15 నిమిషాలు ఎండలో ఉండండి. సూర్యరశ్మిని గ్రహించడం వల్ల మీ మూడ్ మారుతుంది.

దినచర్య

మీరు రోజు ఒకే టైంకు తినడం, నిద్రపోవటం, నిద్ర లేవటం, అలవాటు చేసుకుంటే మంచిది. అలా కాకుండా రోజుకొక సమయంలో తినడం. నిద్ర పోవటం వల్ల శరీరం యొక్క సర్కాడియన్ రిథంలో మార్పులు జరుగుతాయి. దీని వల్ల ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి.

కాఫీ ఎక్కువగా తీసుకోవటం

మీకు ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే పరగడుపున కాఫీ తాగటం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తాగితే దాని ప్రభావం తక్కువగా ఉండొచ్చు.

Read More : సమ్మర్.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్లు తీసుకోండి!

వాకింగ్ చేయండి

తేలికపాటి శారీరక శ్రమ కూడా ఉదయాన్నే మంచి మూడ్‌ను ఇస్తుంది. మార్నింగ్ వాక్ వెళ్లండి. లేదా మీ ఆఫీసులోనే కొద్దిసేపు అటూఇటూ నడవండి. వీటితో పాటుగా సైక్లింగ్ చేయండి లేదా మీ శరీరాన్ని కదిలించే ఏదైనా గేమ్ ఆడండి.

ప్రకృతిని గమనించండి

ఉదయాన్నే అందమైన ప్రకృతిని ఆస్వాధించండి. ఇది మీ మార్నింగ్ మూడ్‌కు మంచి బూస్టర్. వెళ్లే దారిలో ఆకుపచ్చని చెట్లు, రంగురంగుల పూలు, పూల సువాసనలు ఆస్వాధించండి. ఆకాశంలో మేఘాల ఆకృతిని చూడండి. పక్షుల కదలికలు చూడండి. ఇలా కొంతసేపు ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తే చాలు మీ మూడ్ సెట్.

Disclaimer : ఈ సమాచారాన్ని ఆరోగ్య నిపుణుల సలహా మేరకు పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా అందిస్తున్నాం.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×