EPAPER

Vasa : వస పోయటం అంటే?

Vasa : వస పోయటం అంటే?
Vasa

Vasa : అదే పనిగా మాట్లాడే పిల్లలను .. ‘వసపిట్టలా ఎందుకు ఊరికే వాగుతావు?’ అని పెద్దలు విసుక్కోవటం మనకు తెలిసిందే. మాటలు వచ్చే వయసులో చిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని మన పెద్దలు చెబుతుంటారు.
వస అనేది ఒక చెట్టు వేరు భాగం. ఆ వసకొమ్ములు ఏ ఆయుర్వేద షాపుల్లోనైనా దొరకుతాయి. ఒక కొమ్మును గంధం తీసే సాన మీద 2, 3 చుక్కల నీరువేసి రుద్ది.. ఆ జిగురు వంటి పదార్థాన్ని చిన్నారులచేత నాకించాలి. దీనినే వసపోయటం అంటారు.
సాధారణంగా 4 నుంచి 6 నెలల పిల్లలకు వస పోస్తారు. రెండు, మూడు సార్లు ఇలా వసపోస్తే చాలు. ఆదివారంగానీ, బుధవారంగానీ ఈ వస కార్యక్రమం చేస్తుంటారు.
ఆదివారంనాడు వస పోస్తే ఆయుష్షు పెరుగుతుందనీ, బుధవారంనాడు పోస్తే మంచి తెలివి అబ్బుతుందని పెద్దలు చెబుతారు.
చిన్నారులకు వసపోయటం వల్ల.. స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) శుభ్రపడి.. స్వరం మెరుగుపడుతుంది. అలాగే.. నాలుక పలుచబడుతుంది.
మెదడులోని నాడులను వస ఉత్తేజితం చేసి.. పిల్లలు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
అయితే తగు మోతాదులో మాత్రమే ఇవ్వాలి.


Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×