EPAPER

Walking Vs Jogging: వాకింగ్ లేదా జాగింగ్.. బరువు తగ్గడానికి ఏది బెటర్ ?

Walking Vs Jogging: వాకింగ్ లేదా జాగింగ్.. బరువు తగ్గడానికి ఏది బెటర్ ?

Walking Vs Jogging: శరీరాన్ని ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. జిమ్‌కు వెళ్లలేని వారు ముఖ్యంగా వ్యాయామాన్ని దినచర్యగా చర్యల్లో భాగంగా చేసుకోవడం మంచిది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.


పరుగు లేదా నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా మంచిది. శారీరకంగా చురుకుగా ఉండడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచడంలో కూడా సహాయపడుతాయి. పరుగు, నడక మధ్య ఏది ఎక్కువ ఉపయోగకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

వాకింగ్, జాగింగ్ వ్యాయామాలు రెండు శరీరానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, మానసిక ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్ కోసం అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఆరోగ్యానికి అనుగుణంగా ఏ వ్యాయామాలు ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తాయో తెలుసుకోవడం అవసరం.


నడక అనేది అన్ని వయసుల వారు చేసేందుకు వీలుగా ఉంటుంది. ఇది ప్రభావవంతమైన శారీరక శ్రమ అని నిపుణులు చెబుతున్నారు. కానీ రన్నింగ్ మాత్రం చాలా కష్టమైన వ్యాయామం. ఇది తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది శారీరక బలంతో పాటు ఫిట్నెస్‌ను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఈ రెండు వ్యాయామాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల చాలా ఎక్కువ.

నడక వల్ల కలిగే ప్రయోజనాలు:
నడకను తేలికపాటి వ్యాయామంగా చెబుతారు. ఈ వ్యాయామం ఎక్కువ ఒత్తిడిని కలిగించదు. మోకాలు లేదా వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి ఇది ఎంత గానో ఉపయోగపడుతుంది. నడక అనేది చాలా సేపు అలసిపోకుండా చేసే వ్యాయామం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. నడక దినచర్యలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యాయామం వయసుల వారు సులభంగా చేయవచ్చు.

రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు:
నడకతో పోలిస్తే పరుగు అనేది చాలా కష్టమైంది. క్యాలరీలు వేగంగా బర్న్ చేయాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్యాలరీలు బర్న్ కావడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. బరువు తగ్గడానికి ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఏరోబిక్ వ్యాయామం గుండెను బలోపేతం చేయడంతో పాటు హృదయనాళ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వ్యాయామం సహాయంతో శరీరం యొక్క బలం పెరుగుతుంది. ఫిట్ గా ఉండటానికి రన్నింగ్ ఉపయోగపడుతుంది.

Also Read: ఈ డ్రింక్స్‌తో జీర్ణ సమస్యలు మాయం

ఏ వ్యాయామం చేయాలి ?
శరీరాన్ని బట్టి పరుగు, నడక వ్యాయామాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు శరీర బరువు తగ్గడానికి, క్యాలరీలను వేగంగా భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే గనుక మీకు రన్నింగ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థరైటీస్, ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడేవారికి నడక మంచి ఎంపిక. ఈ రెండు వ్యాయామాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×