EPAPER

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం విటమిన్ ఇ క్యాప్సూల్స్‌.. ఇలా అప్లై చేయండి?

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం విటమిన్ ఇ క్యాప్సూల్స్‌.. ఇలా అప్లై చేయండి?

Vitamin E Capsules For glowing skin Benefits and How To Use It: ముఖం కాంతివంతంగా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇందుకోసం చాలా మార్గాలున్నాయి. వాటిలో ఒకటి ఇ కాప్యూల్స్. వీటి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్ ఇ క్యాప్యూల్స్ ‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.  చర్మంలోని ఫ్రీరాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.  విటమిన్ ఇ క్యాప్యూల్స్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలను తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. విటమిన్ ఇ క్యాప్యూల్స్ చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు వృద్ధాప్య సమస్యల నుండి దూరం చేస్తాయి.


విటమిన్ ఇ హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం స్థితిస్థాపకతను, దృఢత్వాన్ని అందించడానికి కొల్లాజన్ చాలా అవసరం. విటమిన్ ఇ కొల్లాజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చర్మానికి ప్రొటీన్‌ను అందించడంలో తోడ్పడుతుంది. ప్రతి రోజు రాత్రి విటమిన్ ఇ క్యాప్యూల్స్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చర్మం కాంతి వంతంగా మెరుస్తుంది. మచ్చలు, ముడతలు తగ్గిస్తాయి. విటమిన్ ఇ ముఖానికే కాదు జుట్టు సంరక్షణకు చాలా మంచిది. విటమిన్ ఇ క్యాప్యూల్స్ ను జుట్టుకు అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా మారుతుంది. చుండ్రు సమస్యను దూరం చేస్తాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం విటమిన్ ఇ క్యాప్యూల్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

విటమిన్ ఇ క్యాప్యూల్, అలోవెరా ఫేస్ ప్యాక్
విటమిన్ ఇ క్యాప్యూల్ బయట మెడికల్ షాప్‌లో దొరుకుతాయి. అలోవెరా జెల్‌తో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇందుకోసం విటమిన్ ఇ క్యాప్యూల్స్ నుండి నూనెను తీసి అందులో రెండు టాస్పూన్‌లు అలోవెరా జెల్‌ను కలిపి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.


Also Read: వీటితో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

విటమిన్ ఇ క్యాప్యూల్స్ , నిమ్మరసం
నిమ్మరసంలో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇందుకోసం రెండు విటమిన్ ఇ క్యాప్యూల్స్ నుండి నూనెను తీసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకావాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

విటమిన్ ఇ క్యాప్యూల్స్ , రోజ్ వాటర్..
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో రోజ్ వాటర్‌ను కలిపి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది.

విటమిన్ ఇ క్యాప్యూల్స్, బొప్పాయి, తేనె
బొప్పాయి గుజ్జులో రెండు విటమిన్ ఇ క్యాప్యూల్స్, టీ స్పూన్ తేనె కలిపి వాటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10- 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Related News

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ చేయడం చాలా సులువు, ఇలా చేసుకుని తింటే కాల్షియం లోపం కూడా రాదు

Big Stories

×