EPAPER

Beauty tips: ముఖానికి పసుపు ఇలా వాడారంటే రంగు పెరగడమే కాదు, చర్మ సమస్యలు రావు

Beauty tips: ముఖానికి పసుపు ఇలా వాడారంటే రంగు పెరగడమే కాదు, చర్మ సమస్యలు రావు

ముఖ సౌందర్యానికి తక్కువ ఖర్చులో అయిపోయే ఉత్తమ పద్ధతి పసుపును వాడడం. దీన్ని స్క్రబ్ గాను వాడొచ్చు, ఫేస్ ప్యాక్ గాను వాడొచ్చు. మురికిని తొలగించుకోవడానికి కూడా వాడొచ్చు. ఎలా వాడినా పసుపు చర్మానికి మేలే చేస్తుంది. చర్మ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పసుపును ఎలా వాడాలో వివరిస్తున్నారు సౌందర్య నిపుణులు.


ముఖానికి మెరుపు తెప్పించడంలో పసుపు ముందుంటుంది. అయితే ముఖంపై పసుపును ఎంతసేపు ఉంచుకోవచ్చు అన్నది చాలామందికి తెలియదు. నిజానికి పసుపును ముఖానికి అప్లై చేసుకున్న తర్వాత 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచుకోకపోవడం మంచిది. దాన్ని శుభ్రం చేసుకోవడం ఉత్తమం లేకుంటే పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి.

చాలామంది ముఖానికి పసుపును రాసుకొని తర్వాత సబ్బుతో లేదా లిక్విడ్ సోప్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. అలా చేయకూడదు. పసుపుతో ఫేస్ ప్యాక్ లేదా స్క్రబ్ వినియోగించినప్పుడు సబ్బును వాడకూడదు. కనీసం మూడు నాలుగు గంటల పాటు సబ్బును ముఖంపై పెట్టకూడదు. కేవలం తక్కువ గాఢత ఉన్న ఫేస్ వాష్ తోనే కడుక్కోవాలి అలాగే ముఖం కడుక్కున్నాక వెంటనే మాయిశ్చరైజర్ రాయాలి లేకుంటే చర్మం మొత్తం పొడిబారిపోతుంది


కంటి చుట్టూ ఉన్న ప్రాంతంలో పసుపును అప్లై చేయకపోవడమే మంచిది మొటిమలు మచ్చలు వంటివి ఉన్నవారు పసుపును రెండు మూడు రోజులకు ఒకసారి తరచూ అప్లై చేస్తూ ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖానికి రాసే పసుపు నాణ్యమైనదిగా ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండడమే మంచిది. బయట ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన పసుపుని కొని ముఖానికి అప్లై చేయండి. పసుపును కూడా కల్తీ చేయడం ఎక్కువగా మారింది. కాబట్టి మీరు వాడుతున్న పసుపు నాణ్యమైనదో కాదో చెక్ చేసుకోండి.

Also Read: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

ముఖంపై ఉన్న మృత కణాలను తొలగించుకోవాలంటే బియ్యప్పిండిలో చిటికెడు పసుపును వేసి పేస్టులా తయారు చేసుకోండి. దాంతోనే ముఖాన్ని స్క్రబ్ చేస్తూ ఉండండి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. పసుపు చర్మానికి మెరుపును అందిస్తుంది. బయట చేసుకునే ఫేషియల్స్ తో పోలిస్తే ఇంట్లో బియ్యప్పిండి, పసుపుతో చేసే స్క్రబ్ చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. ముఖంపై ఉన్న మురికిని పూర్తిగా తొలగిస్తుంది.

Also Read: కొరియన్ స్కిన్ కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

పసుపు బియ్యప్పిండితో కలిపి స్క్రబ్బింగ్ చేసుకున్నాక కచ్చితంగా ముఖానికి మాత్రం మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. ఇది చర్మాన్ని తేమవంతంగా ఉంచుతుంది.

గమనిక: ఈ బ్యూటీ టిప్స్ పాటించే ముందు నిపుణులు లేదా డాక్టర్ సలహా తీసుకోగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ లైవ్’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Meat in Fridge: పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? ఎవరికి ఎక్కువ ప్రమాదమో తెలుసా?

Aloo Bukhara: అల్ బుకారాతో బోలెడు ప్రయోజనాలు

Dasara Recipes: ఈ రెసిపీలను దసరా రోజు తప్పక ట్రై చేయండి

Health Problems: ఏంటీ.. ప్రపంచంలో ఇంతమందికి ఆ సమస్య ఉందా? ఈ లక్షణాలు చూసి.. ఆ లిస్టులో మీరు ఉన్నారేమో చూసుకోండి

Winter Skin Care: చలికాలంలో స్కిన్ కాపాడుకోవడానికి ఇవే బెస్ట్ టిప్స్ ..

Korean Skin: కొరియన్ స్కిన్ కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Big Stories

×