EPAPER

Indian Toilet Vs Western Toilet : ఇండియన్ టాయిలెట్స్ Vs వెస్ట్రన్ టాయిలెట్స్.. ఏది మంచిది?

Indian Toilet Vs Western Toilet : ఇండియన్ టాయిలెట్స్ Vs వెస్ట్రన్ టాయిలెట్స్.. ఏది మంచిది?

 Western Toilet


Indian Toilet Vs Western Toilet : నగరీకరణలో భాగంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే ఒకప్పుడు టాయిలెట్లు లేని ఊళ్లలో వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం పెరిగింది. పట్టణాల్లో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఇంట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్లు వినియోగిస్తున్నారు. భారతీయ టాయిలెట్లను తక్కువగా వాడుతున్నారు. అయితే ఈ రెండు రకాల టాయిలెట్ల వాడకంపై చాలామందిలో అనేక అపోహలు ఉన్నాయి. అందుకే ఇందులో ఏ రకమైన టాయిలెట్ ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

దేశంలో ఒకప్పుడు బహిరంగ మరుగుదొడ్ల వాడటం ఎక్కువగా ఉండేది. తర్వాత మరుగుదొడ్లు నిర్మించుకోవడంపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అటువైపుగా అడుగులు వేశాయి. మొదట్లో గ్రామానికో టాయిలెట్ ఉండగా.. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ టాయిలెట్‌లు ఉన్నాయి.


Also Read : ఈ లక్షణాలు ఉంటే.. శరీరంలో ఐరన్ లోపించినట్లే!

క్రమంగా ప్రజలు విదేశీ కల్చర్ అనుసరించి ఇళ్లలో విదేశీ టాయిలెట్ కమోడ్‌లను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో వెస్ట్రన్ టాయిలెట్ వాడకంపై క్రేజ్ పెరిగింది. దీన్ని ఓ స్టేటస్‌గా చూపించే స్థాయికి కూడా ప్రజలు వచ్చారు. కానీ  ఉన్నప్పటికీ కొందరు దేశీయ టాయిలెట్లను ఇష్టపడతారు. వీటి వాడకం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెప్తున్నారు. వెస్ట్రన్ టాయిలెట్‌లు కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ వాటివల్ల అనేక నష్టాలు ఉన్నాయని హెచ్చిరిస్తున్నారు.

దేశీయ టాయిలెట్ల వినియోగం ఆరోగ్యానికి మంచిది. కూర్చోవడం, నిలబడటం అనేది వ్యాయామంగా పనిచేస్తుంది. వ్యాయామం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా దేశీయ టాయిలెట్ వల్ల రక్త ప్రసరణను పెరుగుతుంది.

దేశీయ టాయిలెట్లపై కూర్చోవడాన్ని స్వాటింగ్ అంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కూర్చునే పొజీషన్ కడుపును పిండుతుంది. వెస్ట్రన్ టాయిలెట్‌ వల్ల కడుపుపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఈ టెయిలెట్ల వినియోగం వల్ల నీరు ఎక్కువగా వృధా అవుతుంది.

గర్భిణీల ఆరోగ్యానికి దేశీయ టాయిలెట్లు మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రసవం సాఫీగా, సహజంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వెస్ట్రన్ టాయిలెట్ వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. కాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఈ టాయిలెట్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి. అయితే దీన్ని ఆరోగ్యంగా ఉన్నవారు ఉపయోగించడం మంచిదికాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

Also Read : నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా..? గుండె జబ్బులకు దీనికి సంబంధం ఏంటి?

వెస్ట్రన్ టాయిలెట్‌ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది అతిసారం,క డుపు సమస్యలకు కారణమవుతుంది. వెస్ట్రన్ టాయిలెట్ సీటుపై కూర్చోడం వల్ల చర్మం దానికి తగులుతుంది. దీనివల్ల క్రిములు సులభంగా వ్యాపిస్తాయి. అందుకే దేశీయ టాయిలెట్లు వాడటం మంచిది.

Disclaimer: ఈ కథనాన్నిపలు అధ్యయనాల ఆధారంగా, ఇంటర్నెట్‌లోని సమచారం మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా భావించండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×