EPAPER

Vaseline Benefits: వాజిలిన్ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవడం ఖాయం

Vaseline Benefits: వాజిలిన్ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవడం ఖాయం

Benefits Of Vaseline: చిన్నప్పటి నుంచి పెదాలు పగిలినా, చర్మం పొడిగా మారినా మనం రాసుకునే పెట్రోలియం జెల్లీ అదేనండి.. వాజిలెన్ గురించి మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి. వాజిలెన్ సరిగ్గా ఉపయోగిస్తే పలు చర్మ సమస్యతో పాటు అనేక సమస్యల బారి నుంచి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు.వాజిలెన్ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.


మార్కెట్లో దొరికే వాజిలెన్‌ను ఎక్కువగా చలికాలంలో పెదాలు, కాళ్లు పగిలితే మాత్రమే వాడుతుంటాము. కానీ దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వాజిలెన్ ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం ముడతలకు: చర్మం పగుళ్ళకు మాత్రమే కాదు.. చర్మంపై ముడతలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్న వాజిలిన్ ప్రతి రోజు రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తగ్గిపోతాయి.
చిట్లిన వెంట్రుకలకు:
వెంట్రుకల చివర్ల చిట్లిపోయి ఉంటే ఎదుగుదల ఆగిపోయినట్టే. జుట్టు ఆరోగ్యం దెబ్బతిన్నట్లే. అలాంటప్పుడు వాజిలిన్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. చిట్లిన వెంట్రుకలకు తరచుగా వ్యాజిలిన్ రాయడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా మారడమే కాకుండా జుట్టు మృదువుగా మెరిసేలా తయారవుతుంది.
పెంపుడు జంతువుల పాదాలకు:
మీరు జంతు ప్రియులైతే మీ ఇంట్లో పెంపుడు జంతువులకు కూడా పెట్రోలియం జెల్లీ బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ కుక్క లేదా పిల్లి పాదాలకు తేమను అందిస్తుంది. అంతేకాకుండా సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఫర్నీచర్ కోసం:
ఇంట్లో బల్లలు, బెడ్ల మీద గీతలు పడి ఉంటే అది చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో గీతలు పడ్డ చోట వ్యాజిలిన్ రాసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు క్లాత్‌తో తుడిచేయండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.
పిల్లల విషయంలో:
డైపర్ వేయడం వల్ల చాలామంది పిల్లలకు దురద, దద్దుర్లు వంటివి వస్తుంటాయి. అలాంటప్పుడు పెట్రోలియం జెల్లీ రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పిల్లల చర్మాన్ని కూడా ఇది చక్కగా కాపాడుతుంది.
మేకప్ తీసేయడానికి:
ఈ రోజుల్లో మేకప్ అనేది చాలా సాధారణ విషయం. అలాంటి మేకప్‌ను తీసేయడానికి ఖరీదైన క్రీములకు బదులు పెట్రోలియం జెల్లీని వాడటం మంచిది. ఇది మీకు బాగా సహాయపడుతుంది. కాటన్ క్లాత్‌కు కొంచెం వ్యాజిలిన్ పూసి దాంతో మేకప్ తొలగించడం చాలా ఈజీ అండ్ సేఫ్ కూడా.


Also Read: ఉడికించిన వేరుశెనగతో బోలెడు లాభాలు

రన్నింగ్ చేసే వారికి:
రోజు రన్నింగ్ చేసేవారు అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ చాలా మంది తమ పాదాలను రక్షించేందుకు ప్రతి రోజూ రన్నింగ్‌కు వెళ్లేముందు వ్యాజిలిన్ రాసుకుంటారు. ఇలా వ్యాజిలిన్ ఉపయోగించడం వల్ల చర్మంపై జిడ్డ పేరుకుపోకుంగా ఉంటుంది. అంతే కాకుండా మృదువుగా ఉంటుంది.

 

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×