EPAPER

Black Pepper Benefits: మిరియాలలో పుష్కలమైన పోషకాలు.. ఇలా వాడితే ఆరోగ్యానికి ఊహించని ప్రయోజనాలు..

Black Pepper Benefits: మిరియాలలో పుష్కలమైన పోషకాలు.. ఇలా వాడితే ఆరోగ్యానికి ఊహించని ప్రయోజనాలు..

Black Pepper Benefits: వంటకాల్లో సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యతే వేరు. సుగంధ ద్రవ్యాలను వాడడం వల్ల ఆహారం రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలలో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సొంటి ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అయితే వీటిని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధాల్లోను ఉపయోగిస్తారు.


సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రత్యేకమైనది. మిరియాలతో శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. అంతేకాదు ఇవి టేస్ట్ బడ్స్ ను ప్రోత్సహించేందుకు కూడా సహకరిస్తాయి. మరోవైపు జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించిన చాలా సమస్యలను కూడా నివారిస్తుంది. మిరియాలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు తోడ్పడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని టీ, డికాషన్ వంటి వాటిలో చేర్చి తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. మరోవైపు ఆహారంలోను ఏదో ఒక విధంగా తరచూ మిరియాలను తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలను కూడా నల్ల మిరియాలతో తగ్గించుకోవచ్చు. నల్ల మిరియాలు, నువ్వుల నూనెలో కలిపి బాగా వేడి చేసి చల్లార్చిన నూనెను మోకాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్న స్థలంలో రాసుకుని మర్దన చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇలా తరచూ చేసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాదు నెయ్యి, మిరియాలను కూడా తరచూ తీసుకోవడం వల్ల మెడ నొప్పి, మోకాళ్లు, డయాబెటీస్ వంటి చాలా సమస్యలు తొలగించుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో మిరియాలు చాలా సహాయపడతాయి. మిరియాలు, పసుపు కలిపిన పాలు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించుకోవచ్చు.


గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఉన్న వారు నల్ల ఉప్పు, నిమ్మరసంతో నల్ల మిరియాల పొడిని కలుపుకుని తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరోవైపు మలబద్ధకం సమస్య ఉన్న వారు నల్ల మిరియాలు తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×