EPAPER

Turmeric Face Packs: పసుపులో ఇవి కలిపి ముఖానికి అప్లై చేస్తే.. అందం రెట్టింపు

Turmeric Face Packs: పసుపులో ఇవి కలిపి ముఖానికి అప్లై చేస్తే.. అందం రెట్టింపు

Turmeric Face Packs: ప్రతి ఒక్కరూ మెరిసే , యవ్వనంగా ఉండే చర్మం కోరుకుంటారు. అలాంటి వారు పార్లర్ లకు వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడవచ్చు. వీటి వల్ల ముఖం అందంగా మారుతుంది. ఇదిలా ఉంటే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి పసుపును ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇది చర్మం రంగును మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది.


పసుపును శతాబ్దాలుగా ఆహారంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తున్నారు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మాన్ని పునరుజ్జీవింపచేయడంలోనూ ఉపయోగపడతాయి. అంతే కాకుండా ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తాయి.

పసుపును రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. తేనె, పెరుగు లేదా పాలతో పసుపు ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకుని వాడటం ద్వారా మీరు మీ చర్మ సంరక్షణను మరింత అద్భుతంగా చేసుకోవచ్చు.


పసుపు, పాలతో ఫేస్ ప్యాక్:
పాలు, పసుపు మిశ్రమం మీ చర్మానికి ఒక వరం. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మంపై చికాకును కూడా తగ్గిస్తుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజంగా మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మీ చర్మాన్ని మచ్చలు లేకుండా చేస్తుంది.

పసుపు ,నిమ్మకాయ రసంతో ఫేస్ ప్యాక్:

పసుపు , నిమ్మకాయ యొక్క సహజ మిశ్రమం చర్మ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చర్మం మెరుస్తూ, యవ్వనంగా ఉంటుంది.

పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్ :
పసుపు, పెరుగు కలయిక మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడమే కాకుండా నేచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. పెరుగులో ఉండే పోషకాలు మీ చర్మాన్ని లోపలి నుండి శుభ్ర పరుస్తాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి మెరిసేలా చేస్తుంది.

పసుపు, టమాటో ఫేస్ ప్యాక్ :
టమాటో, పసుపు ఫేస్ ప్యాక్ చర్మం అందంగా మారడానికి ఉపయోగపడుతుంది. టమాటోలో ఉండే లైకోపీన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది చర్మంపై మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మం యొక్క అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. చర్మంపై చికాకును తగ్గిస్తాయి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని టానింగ్ నుండి కూడా కాపాడతాయి.

Also Read: పండగ సమయంలో మెరిసిపోవాలా ? వీటితో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి

పసుపు, తేనె ఫేస్ ప్యాక్ :
పొడి, నిర్జీవమైన చర్మంతో బాధపడేవారికి పసుపు, తేనె ఫేస్ ప్యాక్ కూడా ఒక గొప్ప ఎంపిక.తేనెలో ఉండే సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

×