EPAPER
Kirrak Couples Episode 1

Turmeric Face Pack: మీ ఫేస్ బంగారంలా మెరిసిపోవాలంటే.. పసుపుతో ఓసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Turmeric Face Pack: మీ ఫేస్ బంగారంలా మెరిసిపోవాలంటే.. పసుపుతో ఓసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Turmeric Face Pack For Glowing Skin: మన వంటిటి పసుపులో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. పసుపును పురాతన కాలం నుంచే ముఖ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు.  పసుపు ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో అద్బుతంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక రకాల ఇన్ఫక్షన్ల నుంచి కాపాడతాయి. మన ఇంట్లో దొరికే పసుపుతో కొద్దిపాటి సమయాన్ని కేటాయించి, పసుపును ఒక్కోపదార్ధంలా కలిపి ముఖానికి అప్లై చేశారంటే ఎంచక్కా మెరిసిపోవచ్చు. మీ ఫేస్ బంగారంలా మెరిసిపోతుందని బ్యూటీ థెరపీ నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీలుకుదిరినప్పుడల్లా ముఖారవిందాన్ని రెట్టింపు చేసుకోండి.


పసుపు తేనే ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటీతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. మీ మఖం కాంతివంతంగా మెరుస్తుంది.

పసుపు, శనగపిండి , తేనె ఫేస్ ప్యాక్
టీ స్పూన్ పసుపులో, రెండు టేబుల్ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ ముఖం మృదువుగా మారుతుంది.


పసుపు, పచ్చిపాలు పేస్ ప్యాక్
పసుపులో టీ స్పూన్ పచ్చి పాలు కలిపి కాటన్ బాల్ సాయంతో ముఖానిక్ అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ముఖంపై మురికి తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

పసుపు, గంధం ఫేస్ ప్యాక్
టీ స్పూన్ గంధం పొడిలో టీ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై మచ్చలు తగ్గుముఖంపడతాయి.

Also Read:  ఇంట్లోనే మొటిమలను తగ్గించే మార్గాలివే

కలబంద, పసుపు ఫేస్ ప్యాక్
కలబంద గుజ్జులో టీ స్పూన్ పసుపు కలపి ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖఛాయ పెరుగుతుంది.

పసుపు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
పసుపులో నిమ్మరసం కలపి ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై మొటిమలు వాటివల్ల ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి.

పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్
టీ స్పూన్ పసుపులో, రండు టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి వారానికి రెండు, మూడు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Besan For Skin: శనగపిండితో అమ్మాయిలే అసూయపడే అందం !

Pomegranate Peels Face Pack: దానిమ్మ తొక్కలతో ఫేస్ ప్యాక్‌.. మీ అందం రెట్టింపు

Garlic Benefits: ప్రతి రోజు వెల్లుల్లి తింటే ఈ సమస్యలన్నీ పరార్ !

Pimple Problem: ఇంట్లోనే మొటిమలను తగ్గించే మార్గాలివే

Older Persons Day: వృద్ధుల కోసం అంగన్‌వాడీ తరహా కేంద్రాలు.. దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

World Heart Day: అతిగా పని చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని మీకు తెలుసా

Big Stories

×