EPAPER
Kirrak Couples Episode 1

Lung Cancer : స్మోకింగ్ చేయకున్నా లంగ్ కేన్సర్‌

Lung Cancer : స్మోకింగ్ చేయకున్నా లంగ్ కేన్సర్‌
Lung Cancer :

Lung Cancer : లంగ్ కేన్సర్.. స్మోకింగ్ అలవాటు లేని వారిని సైతం కబళించే వ్యాధి. ఇందుకు తాజా దృష్టాంతంగా అమెరికా నటి, కమెడియన్ కేట్ మకూచి నిలుస్తారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ చిత్రంలో లూసీ పాత్రను 43 ఏళ్ల మకూచి పోషించారు. ఊపిరితిత్తుల కేన్సర్‌ నుంచి బయటపడేందుకు గత వారమే సర్జరీ చేయించుకున్న ఆమె.. సిగరెట్ పొగ అన్నదే ఎరగదు.


ప్రపంచాన్ని పీడిస్తున్న రెండో అతి పెద్ద కేన్సర్ ఇదే. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా లంగ్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోనూ ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ కేన్సర్ కేసుల పెరుగుదలకు కారణాలు ఎన్నో. టుబాకో స్మోకింగ్, ఇంటిలోపల వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం వంటివి వాటిలో కొన్ని.

స్మోక్ చేసినా, చేయకున్నా.. ప్రతి 16 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు కన్నా పురుషులు ఎక్కువగా లంగ్ కేన్సర్ బారినపడుతున్నారు. యెమెన్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాల్లో ఈ తరహా కేన్సర్ కేసులు తక్కువ. పాక్‌లో ప్రతి లక్ష మందిలో ఆరుగురు మాత్రమే ఊపిరితిత్తుల కేన్సర్‌ బారినపడుతున్నారు.


లంగ్‌కేన్సర్‌తో అత్యధికంగా విలవిలలాడుతున్న దేశం సెర్బియా. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చి ఆన్ కేన్సర్(IARC) గణాంకాల మేరకు కేసుల రేటు 50గా ఉంది. 1990-2008 మధ్య ఈ కేన్సర్ 27.4% పెరిగింది. హంగరీ(కేన్సర్ రేటు 49.8), మాంటినెగ్రో(41.2), ఫ్రెంచి పోలినేసియా(38.5), బోస్నియా అండ్ హెర్జిగోవ్నియా(కేసుల రేటు 38.%) దేశాల్లోనూ ఊపిరితిత్తుల కేసులు ఎక్కువే. వ్యాధి పట్ల చైతన్యం పెంపొందించడంతో పాటు ముందుగానే వ్యాధిని నిర్ధారించుకోవడం ద్వారా లంగ్ కేన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు.

Related News

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Ghee Purity Check: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Brain Health: మీ మెదడును రహస్యంగా దెబ్బతీసే రోజువారీ అలవాట్లు ఇవే, ఇప్పటినుంచి మానేయండి

Turmeric Benefits: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Sitting Too Much Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే ఆరోగ్య సమస్యలు.. ఇదే పరిష్కారం..

Big Stories

×