EPAPER
Kirrak Couples Episode 1

Health Tips: పని, వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోతున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Health Tips: పని, వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోతున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Health Tips: ప్రస్తుతం ఆఫీసు ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు , వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ సవాలుగా మారింది. వీటన్నింటి అధిగమించి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. లేదంటే ఒత్తిడి పెరగిపోయి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.


ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వడం చాలా అవసరం. మరి పని ఒత్తిడిని తగ్గించి బ్యాలెన్స్‌డ్ లైఫ్ కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పనులను బ్యాలెన్స్ చేసుకోండి:


పని, వ్యక్తిగత జీవితాల మధ్య జీవిత సమతుల్యతను సాధించడానికి మొదటి అడుగు సరైన సమయ నిర్వహణ. మీరు మీ పనులకు ప్రాధాన్యతనిస్తూ మీ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి పనికి కొంత సమయాన్ని నిర్ణయించుకుని ఆ టైమ్‌లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీంతో పనితో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా సమయం ఇవ్వగలుగుతారు.

ప్పకుండా ప్రతి రోజు వ్యాయామం చేయండి:

శారీరక వ్యాయామం మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామం వంటివి చేయడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. అంతే కాకుండా మనస్సులో సానుకూలత పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి:

మన ఆహారపు అలవాట్లు మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, ఫైబర్ తగిన మొత్తంలో ఉండే సమతుల్య మరియు పోషకమైన ఆహారం తీసుకోండి. ఇది మీ శరీరం మరియు మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది.

విరామం తీసుకోవడం మర్చిపోవద్దు:

ఎక్కువసేపు పని చేస్తే, మీరు త్వరగా ఒత్తిడి, అలసట చెందుతారు.. కాబట్టి ఎప్పటికప్పుడు చిన్నపాటి బ్రేక్ తీసుకోండి. ఇది మిమ్మల్ని ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా మానసిక అలసటను కూడా తగ్గిస్తుంది. ఇలా బ్రేక్ తీసుకోవడం వల్ల కొత్త ఆలోచనలు, ఉత్సాహంతో పని చేయగలుగుతారు.

Also Read: రోజూ కాఫీ తాగితే ఇన్ని లాభాలా.. అలవాటు లేకపోతే ఇవి మిస్ అవుతున్నట్లే!

“లేదు” అని చెప్పే కళను నేర్చుకోండి:

కొన్నిసార్లు మనం ఇతరులను సంతోషపెట్టడానికి ఎక్కువ పని బాధ్యతలను తీసుకుంటాము. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే అవసరమైనప్పుడు “లేదు” అని చెప్పడం నేర్చుకోండి. ఇది మానసిక, శారీరక అలసటను నివారించడానికి సహాయపడుతుంది.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి:

శరీరానికి తగినంత నిద్ర పోవడం చాలా అవసరం. మానసిక , శారీరక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజు 7-8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇది మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా మీరు రోజంతా తాజాగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Black Nose: ముక్కు నల్లగా మారిపోయిందా? అయితే మీకు ఆ వ్యాధి వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Besan For Skin Glow: శనగపిండితో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం

Potato Stuffed Egg Bonda: పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ, ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్ స్నాక్

Skin Care Tips: ఈ టిప్స్‌తో న్యాచురల్‌గా మెరిసిసోతారు

Multani Mitti For Skin Glow: ముల్తానీ మిట్టితో.. మొటిమలు మాయం

Homemade Hair Oil: తెల్లజుట్టును నల్లగా మార్చే ఆయిల్ ఇదే !

Big Stories

×