EPAPER

Skin Care Tips For Monsoon: వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు చెక్ పెట్టండిలా ?

Skin Care Tips For Monsoon: వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు చెక్ పెట్టండిలా ?

Skin Care Tips For Monsoon: వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. దీంతో చర్మం త్వరగా జిడ్డు లాగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వర్షాకాలంలో చర్మంపై జిడ్డు వల్ల రంథ్రాలు, మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. ఫలితంగా చాలా మంది ఈ సీజన్‌లో చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి.


శరీర దుర్వాసన:
వర్షాకాలంలో వచ్చే చెమట వల్ల అండర్ ఆర్మ్స్, ఇతర శరీర భాగాల్లోనూ దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించడానికి ఒక వేళ డియోటెంట్లను వాడితే అవి అలర్జీ, దద్దుర్లకు దారి తీస్తాయి. అందుకే సీజన్‌లో చెమలు ఎక్కువగా పట్టేవారు సహజమైన ఉత్పత్తులను వాడాలి. అంతే కాకుండా కాటన్ దుస్తులు, స్వెట్ ప్యాడ్స్ వాడితే దుర్వాసన నుంచి దూరంగా ఉండవచ్చు.

చెమట, దద్దుర్లు :
ఎర్రటి రంగులో వర్షాకాలంలో దద్దుర్లు  ఏర్పడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో లోఫీవర్‌తో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చర్మంపై కొన్ని ప్రదేశాల్లో చర్మ రంద్రాల్లో ఏదో అడ్డుపడటం వల్ల ఈ దద్దుర్లు ఏర్పడతాయి.


ఫంగల్ స్కిన్ ఇన్పెక్షన్లు:

వర్షాకాలంలో తామర వంటివి ఎక్కువగా వస్తుంటాయి. కాలి వేళ్ల మధ్య, రహస్య భాగాలతో పాటు , శరీర మడతల్లో ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వారిలో ఇవి త్వరగా వ్యాపిస్తూ ఉంటాయి.

తామర:
వర్షాకాలంలో ముఖ్యంగా తేమతో పాటు చర్మం కూడా పొడిబారుతుంది. ఇది దురద, తామర వంటి దద్దుర్లకు దారి తీస్తుంది.

వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి చిట్కాలు:

  • వివిధ చర్మ రకాల వారు తప్పకుండా ఎక్సోఫోలియేట్ చేసుకోవాలి. చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు ఇది తొలగిస్తుంది.
  • వర్షాకాలంలో కూడా సన్ స్క్రీన్ లోషన్‌లను తప్పకుండా వాడటం మంచిది.
  • వర్షాకాలంలో వేసుకునే మేకప్ సున్నితంగా ఉండేలా చూసుకోండి.
  • రాత్రి పడుకునే ముందు కూడా తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకండి.
  • జిడ్డు చర్మం ఉన్న వారు తప్పకుండా ఈ సీజన్లో రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోండి.
  • పొడి చర్మం ఉన్న వారు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలి.
  • చర్మంపై దురద సమస్య ఉన్న వారు వర్షంలో తడిచి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేశాక సహజమైన ఉత్పత్తులను చర్మానికి రాసుకోవాలి, వీలైనంత వరకు ఈ సీజన్‌లో మేకప్‌కు దూరంగా ఉండటం మంచిది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×