EPAPER

Ghee For Weight Loss: నెయ్యిని ఇలా తింటే 30 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు తెలుసా ?

Ghee For Weight Loss: నెయ్యిని ఇలా తింటే 30 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు తెలుసా ?

Ghee For Weight Loss: నెయ్యి పేరు చెబితేనే చాలా మందికి నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. పప్పులో నెయ్యి కలిపుకుని తింటే దాని సువాసన వంటగదితో పాటు ఇల్లంతా వ్యాపిస్తుంది. నెయ్యి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే ఇందులో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందన్న భయం అందరికీ ఉంటుంది. ఈ కారణంగా ఆహారంలో నెయ్యి, నూనె వాడకాన్ని చాలా వరకు తగ్గిస్తుంటారు.


అయితే నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ దాంతో బరువు తగ్గించుకోవచ్చు. దీన్ని తినే పద్ధతిలో తింటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి నెయ్యిని ఎలా తినాలో ఇప్పడు చూద్దాం.
కొవ్వును కరిగిస్తుంది:
నెయ్యిలో ఉండే కాంజుగేటెడ్ లినోలెయిక్ ప్రధానంగా కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. ఈ విషయం అనేక అధ్యయనాల్లో కూడా రుజువైంది. రోజు నెయ్యి తినడం వల్ల శరీరంలోని కొవ్వు విచ్ఛిన్నమై కొత్త కొవ్వు కణాలు ఏర్పడటం ఆగిపోతుంది. ఈ విధంగా రోజువారి ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. నెయ్యిని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ఎక్కువ తీసుకోవడం మాత్రం కొవ్వు పెరిగిపోతుంది.

స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన నెయ్యిలో లినోలిక్ ఆమ్లం, సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు మొండి కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పప్పు, రోటీతో పాటు కొంత మొత్తంలో నెయ్యిని క్రమం తప్పకుండా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. నెయ్యి తినడం వల్ల మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. హానికరమైన పదార్థాలు శరీరం నుంచి బయటకు వస్తాయి . బరువును కూడా ఇది తగ్గిస్తుంది.


నెయ్యి తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ఇతర ఆహార పదార్థాలేవీ తినాలని అనిపించదు. నెయ్యితో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. ఆహారంలో నెయ్యి చేర్చడం వల్ల కడుపు ఎక్కువ నిండుగా ఉండి తరచూ ఆకలి అనిపించదు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి నిరంతర శక్తిని అందిస్తుంది. కాబట్టి అనవసరమైన స్నాక్స్ తినాలన్న కోరిక కూడా కలగదు. ఎక్కువసేపు ఆకలి లేకపోవడంఏమీ తినకుండా ఉంటారు. దీని వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు పాటించే బదులు వివిధ రకాల ఆహారాలు తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Also Read: పులిపిర్లకు చెక్‌ పెట్టడానికి చక్కని చిట్కా..

ఇలా తినండి:
మీరు బరువు తగ్గడానికి దేశీ నెయ్యిని ఉపయోగించాలని అనుకుంటే మీరు దీనిని అనేక విధాలుగా మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం లేచి గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నెయ్యి కలుపుకుని తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. దీనితో పాటు మీరు మీ రోజువారి వంటల్లో నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. మీకు టీ లేదా కాఫీ తాగడం ఇష్టం అయితే అందులో ఒక చెంచా నెయ్యి మిక్స్ చేసి కూడా తాగవచ్చు. కానీ ముందే చెప్పినట్లుగా నెయ్యి అతిగా తినకూడదని గుర్తుంచుకోండి

Related News

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ చేయడం చాలా సులువు, ఇలా చేసుకుని తింటే కాల్షియం లోపం కూడా రాదు

Big Stories

×