EPAPER

Tips For sharp Mind: ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది తెలుసా !

Tips For sharp Mind: ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది తెలుసా !

Tips For Sharp Mind: మెదడు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఎన్నో ఒత్తిళ్ల వల్ల కొన్ని సందర్భాల్లో మెదడు చురుగ్గా పనిచేయక పోవడం, చేసే పనిపై కూడా ఏకాగ్రత ఉండక పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. అయితే ఈ సమస్యలన్నీ తొలగిపోయి మెదడు చురుగ్గా పవర్ ఫుల్‌గా పని చేయాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటి వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచన శక్తి మెరుగుపడుతుందని అంటున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం:
శరీరంలో రక్తప్రసరణ తగిన విధంగా ఉండాలంటే వ్యాయామం తప్పకుండా చేయాల్సిందేనని నిపుణులు అంటున్నారు. వ్యాయామం వల్ల ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా పెరిగి ఆక్సిజన్, పోషకాలు తగిన స్థాయిలో అందుతాయి. అంతే కాకుండా వ్యాయామం వల్ల న్యూరాన్ల పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. అలా అని మరీ కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. ఏరోబిక్ వ్యాయామాలు నడక, జంపింగ్ వంటివి చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. 2011లో జర్నల్ అఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేసే వారి మెమొరీ పవర్ బాగా మెరుగుపడుతుందని ఓ పరిశోధనలో కనుగొన్నారు. ఈ పరిశోధనలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.
ఆహారం:
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మెదడుకు సంబంధించిన సమస్యలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు, బెర్రీస్, చేపలు, డ్రైఫ్రూట్స్ వంటివి మెదడు పనితీరును బాగా మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి
నిద్ర:
నిద్రపోయిన సమయంలోనే మన బ్రెయిన్‌కు విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడే మన జ్ఞాపకాలు, కొత్తగా నేర్చుకున్న అంశాలను క్రమపద్ధతిలో స్టోర్ చేసుకుంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం సరైన నిద్రలేకపోవడం వల్ల మతిమరుపు వస్తుంది. అంతే కాకుండా ఇది జ్ఞాపకశక్తి శక్తిని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి బ్రెయిన్ ను మరింత పదునుగా ఉంచడానికి రాత్రి తగినంత నిద్రపోయేలా చూసుకోవడం మంచిది.
ధ్యానం:
రోజులో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మెదడులోని గ్రే మేటర్ మెరుగుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలో వెల్లడైంది. మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞాపకశక్తికి ఉద్వేగాలను నియంత్రించుకోవడానికి గ్రమేటర్ కీలకమని పరిశోధకులు వెల్లడించారు.
పజిల్స్:
పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల మెదడు పనితీరు బాగా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధనలో కూడా ఇది రుజువైంది. తరుచుగా పజిల్స్ చేయడం వల్ల మెదడు కణాలు యాక్టివ్‌గా మారతాయి. ఫలితంగా ఇది మెదడు పనితీరును పెంచుతుంది.
కొత్త వాయిద్యాన్ని నేర్చుకోవడం:
ఇదేనా కొత్త వాయిద్యాన్ని నేర్చుకోవడం వంటివి చేయడం వల్ల మెదడులోని వివిధ భాగాలు యాక్టివేట్ అవుతాయి . శరీరంలోని చేతులు, కాళ్లు, కళ్ళ వంటి అవయవాలను నియంత్రించే సామర్థ్యం మరింత పెరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకు ఇది దూరంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.


Also Read: డ్రాగన్ ఫ్రూట్‌ ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు !

చల్లని నీటితో స్నానం:
రోజు కొద్దిసేపు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో వేగస్ నాడి స్టిమ్యులేట్ అవుతుంది. ఇది యాంగ్జయిటీని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేస్తేందుకు ఉపయోగపడుతుంది.
పాజిటివ్ ఆటిట్యూడ్:
నెగెటీవ్ ఆలోచనలను దూరం పెట్టి పాజిటివ్ థింకింగ్ పెంచుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా మెదడు చురుకుగా పని చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.


Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×