EPAPER

Hair Growth Tips: విపరీతంగా జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి

Hair Growth Tips: విపరీతంగా జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి

Hair Growth Tips: ఆడవారి అందాన్ని పెంచడంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా మంది జుట్టు పట్టుకుచ్చులా అందంగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. కానీ మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. దీంతో చాలా మంది జుట్టు పెంచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే జుట్టు ఊడటం తగ్గుతుంది. పైగా వెంట్రుకలు కూడా వేగంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


తల ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ దానిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. కానీ తడి జుట్టును ఆరబెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే. అందుకే చాలామంది హెయిర్ డ్రయర్‌లను వాడుతుంటారు. హెయిర్ డ్రయర్లు వాడటం వల్ల దీని నుంచి వచ్చే వేడి జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం స్టైలింగ్, స్ట్రైట్‌నింగ్ కోసం వాడే హెయిర్ ప్రొడక్స్ట్ వల్ల మాత్రమే కాకుండా ఎండలో అతిగా తిరగడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది.

గట్టిగా జుట్టు అల్లడం కూడా ఊడిపోవడానికి కారణం అవుతంది. అంతే కాకుండా తడి జుట్టును త్వరగా ఆరిపోవాలని తువాలుతో కొట్టడం వంటివి చేసినా కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. 2016లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వేడి, స్టైలింగ్ టూల్స్, హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్‌నర్, కర్లియర్ వంటివి జుట్టు కుదుళ్లకు నష్టాన్ని కలిగిస్తాయని కనుగొన్నారు.


కెరాటిన్ నష్టం జుట్టును చాలా వరకు బలహీనపరుస్తుంది. తద్వారా జుట్టు ఊడిపోవటానికి కారణం అవుతుంది. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ అఫ్ మెడిసిన్ డెర్మటాలజిస్టులు పాల్గొన్నారు. చాలా మంది తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇలా కండీషనర్స్ అప్లై చేసిన వెంటనే చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది తల మీద దువ్వెనతో దువ్వుతుంటారు. అయితే ఈ ప్రక్రియ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గే మాట అటుంచితే కుదుళ్లకు ఇది హాని కలిగిస్తుంది.

కాబట్టి తడిగా జుట్టు ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. జుట్టు ఆరే వరకు ఆగి ఆ తర్వాతే దువ్వాలి.
చాలా మంది జుట్టు పెరడం కోసం ఎవరెవరో చెప్పింది, గూగుల్ లో ఏది పడితే అది సెర్చ్ చేసి అందులో చూపించిన టిప్స్ ఫాలో అవుతుంటారు. అయితే ఇలాంటి కొన్ని సార్లు టిప్స్ మేలు చేయకపోగా చెడు చేస్తాయి. వాటి ప్రభావంతో జుట్టుపై ప్రభావం పడుతుంది. కాబట్టి నిపుణుల సలహా లేనిదే ఏదీ వాడకుండా ఉండటం మంచిది.

Also Read: జిమ్‌లో మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త !

జుట్టు కట్ చేసే తొందరగా పెరుగుతుందనే అపోహతో చాలామంది తరుచుగా కట్ చేస్తుంటారు. కానీ రెండు నెలలకొకసారి మాత్రమే జుట్టు కత్తిరించుకోవాలని కొందరు సూచిస్తున్నారు. జుట్టు చిట్లడం, చివర్లో పొడి బారడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకు అవరోధంగా మారుతుంది. కాబట్టి దానిని తొలగించడం తప్పనిసరి. చాలామంది జుట్టుకు నూనె పెట్టుకోరు. వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో మర్దనా చేయడం వల్ల మాడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది కురులను సంరక్షిస్తుంది.

Related News

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Big Stories

×