EPAPER
Kirrak Couples Episode 1

Pimples : 3 రోజుల్లో పులిపిర్లు రాలిపోయే చిట్కాలు

Pimples : 3 రోజుల్లో పులిపిర్లు రాలిపోయే చిట్కాలు

Pimples : సాధారణంగా మన శరీరంలో ఎక్కడపడితే అక్కడ పులిపిర్లు వస్తుంటాయి. కొన్ని పులిపిర్లు ఎలాంటి నొప్పి లేకుండా చర్మంలో కలిసిపోతాయి. కానీ కొన్ని పులిపిర్లు మాత్రం నొప్పి మరియు దురదను కలిగిస్తాయి. అసలు పులిపిర్లు రావడానికి ప్రధాన కారణం ఒక వైరస్. పులిపిర్ల కోసం మనం ఎన్నో రకాల మందులను వాడుతుంటాం. కానీ అవేవీ సమర్థవంతంగా పనిచేయవు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ పులిపిర్లను నొప్పి లేకుండానే తొలగించుకోవచ్చు. ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. అలా దంచిన వెల్లుల్లి పేస్ట్‌ను వడకట్టుకొని జ్యూస్ తీసుకోవాలి. వెల్లుల్లి జ్యూస్‌లో ఉండే ఒక రకమైన ఫంగస్ ఈ పులిపిర్లను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌లో అర చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా పులిపిర్లను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. తర్వాత దీనిలో అరచెంచా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం కూడా ఇవి తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మూడింటిని బాగా కలిపి ఆ తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కట్ చేసి దానితో పులిపిర్లు ఉన్నచోట అప్లై చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల కేవలం మూడు రోజుల్లో పులిపిర్లు రాలిపోతాయి. మరో చిట్కా.. దీనికోసం ఒక గిన్నెను తీసుకొని అందులో చెంచా సర్ఫ్ వేసుకోవాలి. బట్టల సబ్బు కూడా వేసుకోవచ్చు. పులిపిర్లు పోగొట్టడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో అరచెంచా బేకింగ్ సోడా, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని పులిపిర్లు ఉన్నచోట వెల్లుల్లి రెబ్బతో రాసుకోవాలి. ఆ తర్వాత మూడు నిమిషాలు ఆగి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు, మూడు రోజులు చేయడం వల్ల ఏమాత్రం నొప్పి లేకుండా పులిపిర్లు రాలుతాయి. కాకపోతే ఈ మిశ్రమం రాసుకునేటప్పుడు పులిపిర్లు ఉన్నచోట కొంచెం నొప్పి, మంటగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయినా క్రమం తప్పకుండా మూడు రోజులు ఇలా చేయడం వల్ల పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి. ఈ మిశ్రమాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.


Tags

Related News

Cucumber Benefits: కీరదోస తింటే ఎటువంటి ప్రమాదకర సమస్యలు అయినా పరార్..

Korean Skincare Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. కొరియన్‌ గ్లాసీ లుక్‌ సొంతం.

Drinking Orange Juice Daily: రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి నష్టమే.. ఎలాగంటే?..

Plastic Food Packaging: ఇలాంటి ఫుడ్ తింటే రొమ్ము క్యాన్సర్ కు వెల్కం చెప్పినట్లే.. తస్మాత్ జాగ్రత్త

Tips For Glow Skin: శనగపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. మీ అందం చూసి మీరే మురిసిపోతారు..

Mayonnaise: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు

Liver Health: మనదేశంలో 66 శాతం మరణాలకు కాలేయ సమస్యలే కారణమట, చెబుతున్న కొత్త నివేదిక

Big Stories

×