EPAPER

Skin Care Tips: మొటిమలు, మచ్చలు లేని ఫేస్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Skin Care Tips: మొటిమలు, మచ్చలు లేని ఫేస్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Skin Care Tips: ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతే కాకుండా మొటిమలు, మచ్చల లాంటివి ఉండకూడదని అనుకుంటారు. అలాంటి వారు అందంగా కనిపించడం కోసం ఏవేవో ఫేస్ క్రీమ్‌లను వాడటం ప్రారంభిస్తారు. అయితే  ఫేస్ ప్రొడక్ట్స్ వాడటం తాత్కాలికంగా ముఖం అందంగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇలా జరగకుండా ముఖం ఎల్లప్పుడు మెరుస్తూ ఉండటం కోసం కొన్ని రకాల టిప్స్ ఫాలో అవడం ఎంతైనా అవసరం.


చాలా మందికి రోజుకు రెండు సార్లు ఫేస్ వాష్ చేసినా కూడా ముఖంపై మొటిమలు వస్తుంటాయి. సాధారణంగా ఉదయం పూట బయట తిరిగి వచ్చినప్పుడు కాలుష్యం కారణంగా లేదా దుమ్ము, ధూళి కారణంగా ముఖంపైన జిడ్డు పేరుకుపోతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడటానికి ఇది కారణం అవుతుంది. అందుకే ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోయి.. ఆరోగ్యమైన చర్మం పొందాలంటే రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతే కాకుండా ముఖం కడుక్కునే సమయంలో కొన్నిరకాల టిప్స్ ఫాలో అవ్వాలి. ఇవి మీ అందాన్ని మరింత పెంచడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతులు శుభ్రం చేసుకోవాలి:
మనం ముఖాన్ని తాకే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఏవైనా ప్రొడక్ట్స్ ఫేస్‌పై అప్లై చేసే ముందు చేయాల్సిన ముఖ్యమైన పని చేతులను శుభ్రం చేసుకోవడం. ఇలా చేస్తే చేతులకు ఉన్న మురికి, బ్యాక్టీరియా ఫేస్ మీదకు వెళ్లకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఫేస్ క్లీన్ చేసే ముందు తప్పనిసరిగా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి


మేకప్ తొలగించండి:
ముఖ్యంగా మేకప్ వేసుకునే అలవాటు ఉన్న వారు రాత్రి పూట కచ్చితంగా పడుకునే ముందు రిమూవ్ చేయాలి. లేకపోతే అందులో ఉన్న రసాయనాలు ఫేస్‌ని మరింత పాడుచేస్తాయి. మేకప్ రిమూవర్ ఉపయోగించి సున్నితంగా మీ ఫేస్ పై ఉన్న మేకప్‌ను తొలగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ముఖంపై మొటిమలు, రంధ్రాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖం శుభ్రం చేసుకోవడానికి గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. అలాగని బాగా వేడి చేసిన నీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది చర్మాన్ని కఠినంగా మారుస్తుంది. అంతేకాకుండా చర్మం పొడిబారేందుకు కారణమవుతుంది.

క్లెంజర్ వాడకం :
ముఖం అందంగా మెరుస్తూ ఉండటానికి ముందుగా ఎంచుకున్న క్సెంజర్‌ను కొద్దిగా తీసుకుని చేతి వేళ్లతో ముఖానికి అప్లై చేసుకోండి. ఆ తర్వాత చేతి వేళ్లను కదిలిస్తూ మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా జిడ్డు, ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముఖంపై ఉన్న నుదురు, ముక్కు, పెదాల చుట్టూ ఉన్న సున్నితమైన ప్రాంతాలను మసాజ్ చేసుకోవడం మంచిది.  ఇలా మసాజ్ చేయడానికి కనీసం 20 సెకన్ల సమయం తీసుకోండి. దీంతో మంచి ఫలితాలు ఉంటాయి.

Also Read: చక్కటి నిద్ర కోసం సింపుల్ చిట్కాలు

డైట్ :
ఆరోగ్య కరమైన ఆహారం చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. పోషకాలు ఉన్న ఫ్రూట్స్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి తగింత నీరు కూడా తీసుకోవడం అవసరం. ఇది ముఖం అందంగా కనిపించడానికి ఉపయోగపడుతుంది.

Related News

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Big Stories

×