EPAPER
Kirrak Couples Episode 1

Mental Health: ఇలా చేస్తే చాలు.. డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు

Mental Health: ఇలా చేస్తే చాలు.. డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు

Mental Health: ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రించే సమయంతో పాటు రోజువారీ అలవాట్లు కూడా మారిపోయాయి. ఇది మన మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా, చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.


అనేక మంది ప్రస్తుతం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి డిప్రెషన్. డిప్రెషన్ అనేది ఒక వ్యక్తి విచారంగా, నిస్సహాయంగా భావించే తీవ్రమైన మానసిక స్థితి. మనలో ఎక్కువ మంది దీనిని పట్టించుకోరు. కానీ సరైన సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మానసిక సమస్యలను నియంత్రించవచ్చు. మరి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఏం చేయాలి ?


ప్రతిరోజు వ్యాయామం చేయడం ముఖ్యం:
శారీరక శ్రమ మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం, యోగా, ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయండి:
డిప్రెషన్ ఉన్నప్పుడు ఒంటరిగా అనిపించవచ్చు, కానీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటానికి ఇదే మీకు మంచి సమయం. మీ భావాలు, సమస్యలను వారితో పంచుకోండి. ఇది మీకు మానసిక ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, మీకు సహాయం చేసే వ్యక్తులెవరో నీ వారెవరో తెలుస్తుంది.

మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి :
మన ఆహారం మన మానసిక ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా డిప్రెషన్ ను తొలగించడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం చాలా ముఖ్యం. సమతుల్య, పోషకాహారం శరీరక, మానసిక ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా మానసిక అలసట కూడా తొలగిపోతుంది. జంక్ ఫుడ్‌ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్ వల్ల మానసిక ఆరోగ్యం చాలా ప్రభావితం అవుతుంది.

ఏమి చేయకూడదు ?

ఒంటరిగా ఉండకండి:
డిప్రెషన్‌లో ఉన్న వారు అందరి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రపంచం నుండి తమను తాము వేరుచేసుకుంటారు. ఈ తప్పు అస్సలు చేయకూడదు. ఒంటరిగా ఉండటం వల్ల మీ మానసిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అందరితో సన్నిహితంగా ఉండండి. సమాజంలో భాగస్వామ్యాన్ని పెంచుకోండి.

Also Read: ఈ 5 పదార్థాల్లో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్

నెగటివ్‌గా ఆలోచించడం మానుకోండి:
డిప్రెషన్ సమయంలో నెగెటివ్ ఆలోచనలు రావడం సహజమే కానీ.. వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. ప్రతి కష్టాన్ని అవకాశంగా చూడండి. సానుకూల దృక్పథంతో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ పనినైనా సాధించగలుగుతారు.

మద్యం లేదా సిగరెట్లు తీసుకోవద్దు :
డిప్రెషన్ నుంచి బయటపడటానికి, ఆల్కహాల్ లేదా ఇతర మత్తు పదార్థాలను తీసుకోకుండా ఉండండి. ఈ పదార్థాలు మానసిక , శారీరక ఆరోగ్యానికి హానికరం. ఇది మీ పరిస్థితిని మరింత దిగదార్చుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.బ

Related News

Cloves Health Benefits: లవంగాలతో మతిపోయే లాభాలు!

Orange Peel For Face: నారింజ తొక్కతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Rice Water For Skin: రైస్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం

UTI and Fridge: మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడటానికి ఇంట్లో ఉండే ఫ్రిజ్ కూడా కారణమే, అదెలాగంటే..

Chapati On Gas: చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే

Egg Curry Recipe: కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ.. బిర్యానీకి జతగా టేస్ట్ అదిరిపోతుంది..

Big Stories

×