EPAPER

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Hair Care Tips: వర్షాకాలం శరీరానికి  రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఇది  జుట్టు సమస్యలను పెంచుతుంది. ఈ సీజన్ లో వర్షం తేమ కారణంగా, జుట్టు జిగటగా మారుతుంది . తలపై నూనె పేరుకుపోతుంది. అంతే కాకుండా ఇది చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో జిడ్డు,స్కాల్ప్‌ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే.. కొన్ని సులభమైన టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్యలను వదిలించుకోవచ్చు.


వారానికి మూడు సార్లు షాంపూ వాష్:

వర్షాకాలంలో జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ తల చర్మం జిడ్డుగా ఉంటే వారానికి కనీసం మూడు సార్లు షాంపూతో తలస్నానం చేయండి. ఇందుకోసం మీరు తేలికపాటి షాంపూని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఇది తలపై ఉన్న అదనపు నూనెలను తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.


హెయిర్‌కు వేపాకు వల్ల ఉపయోగం:

వేప ఆకులలో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. వేప ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని చల్లార్చి వాటితో హెయిర్ వాష్ చేయాలి. . ఇది తలలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా జిడ్డును తొలగిస్తుంది.

సరైన ఆహారాన్ని తినండి:
మీ ఆహారం మీ జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. వర్షాకాలంలో ఆయిల్ స్కాల్ప్‌ను వదిలించుకోవడానికి.. మీ ఆహారంలో మసాలా, తీపి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. బదులుగా, ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గింజలు జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు ఉన్న ఆహారం తినడం వల్ల కూడా జుట్టు సమస్యలు తగ్గుతాయి.

Also Read: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

హెయిర్ మాస్క్ వాడటం:

ఆయిలీ స్కాల్ప్ కోసం వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పెరుగు ,నిమ్మకాయ లేదా ముల్తానీ మిట్టితో హెయిర్ మాస్క్‌ని తయారు చేసి తలకు అప్లై చేయండి. ఈ మాస్క్‌లు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా జుట్టును మృదువుగా చేస్తాయి.

మనకు తెలియకుండానే వెంట్రుకలను పదే పదే తాకుతూ ఉంటాం. దాని వల్ల తలపై నూనె, మురికి పేరుకుపోతుంది. మీ జుట్టును వీలైనంత తక్కువగా తాకడానికి ప్రయత్నించండి. అంతే కాకుండా జుట్టు సమస్యలు ఉన్న వారు రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వారికి రసాయనాలతో ఉన్న  ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అందుకే  వాటిని ఉపయోగించకుండా హోం రెమెడీస్ వాడటం మంచిది.  వాటి వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Big Stories

×