EPAPER
Kirrak Couples Episode 1

Weight Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే పడుకునే ముందు ఈ టిప్స్ పాటించండి

Weight Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే పడుకునే ముందు ఈ టిప్స్ పాటించండి

Weight Tips: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధిక బరువు అనేది అతి పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం, గుండె పోటు, డయాబెటీస్ వంటి రకరకాల సమస్యల బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఎక్కడ చూసినా కూడా అధిక బరువు సమస్యతో బాధపడేవారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే పనుల్లో బిజీగా ఉంటూ వ్యాయామం చేయడానికి కూడా తీరిక లేకుండా బ్రతికేస్తున్నారు. అయితే వ్యాయమం చేయకుండా కూడా చాలా రకాలుగా బరువు తగ్గే మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట సమయం లేని వారు రాత్రి వేళ కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మార్గాలు ఏంటో తెలుసుకుందాం.


రాత్రి 7 గంటలకు ముందే భోజనం :

బరువు తగ్గాలనుకునే వారు రాత్రి వేళ చేసే భోజనం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రాత్రి వేళ 7 గంటల లోపే భోజనం చేయాల్సి ఉంటుంది. నిద్రకు భోజనానికి దాదాపు 3 గంటల పాటు అయినా గ్యాప్ ఉండాలి. ఇలా చేయడం వల్ల రాత్రి చేసిన భోజనం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. అందువల్ల రాత్రివేళ త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.


తేలికపాటి ఆహారం :

రాత్రివేళ చేసే భోజనం చాలా తేలికపాటిది తీసుకోవాలి. అందులో ప్రోటీన్, ఫైబర్ వంటి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందువల్ల పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్ వంటివి తీసుకోవాలి. ఇలా తీసుకున్న సమయంలో రాత్రి వేళ ఆకలిగా ఉండే కీరదోస, యాపిల్ వంటివి తీసుకుంటే మంచిది.

నిద్రపోవడం :

ఆహారంతో పాటు బరువు తగ్గాలనుకునే వారికి నిద్ర కూడా చాలా అవసరం. శరీరంలోని మెలటోన్ అనే హార్మోన్ బ్రౌన్ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. అంతేకాదు రాత్రి వేళ నిద్ర కూడా సరిగా పోయేందుకు సహకరిస్తుంది.

పసుపు పాలు :

రాత్రి వేళ భోజనం తర్వాత పసుపు పాలు తాగితే మంచిది. ఇలా నిద్రపోయే ముందు తరచూ పసుపు పాలు తీసుకుంటే శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

7 గంటల నిద్ర :

అధిక బరువుతో బాధపడేవారు తప్పకుండా 7 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. నిద్ర లేకపోతే కూడా బరువు తగ్గడం అనేది కష్టం అవుతుంది.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Tomato Juice: టమాటా రసం తాగితే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

Vitamin E Capsules: విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో మీ అందం రెట్టింపు

Vitamin deficiency: మీకు విపరీతంగా జుట్టు రాలిపోతుందా? అయితే ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే, వీటిని తినండి

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గండిలా ?

Screen Strain Eye Health: ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడడంతో కంటి సమస్యలు.. ఈ సెటింగ్స్ తో మీ ఆరోగ్యం కాపాడుకోండి!

Tea and Biscuits: ఇప్పటివరకు తిన్నది చాలు, ఇకపై టీ తాగుతూ బిస్కెట్లు తినడం మానేయండి, అది మీకే ప్రమాదం

Big Stories

×