Big Stories

Fermented Foods : పులియబెట్టిన ఆహారం తింటే జరిగేది ఇదే

Fermented Foods : పూర్వం టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు ఆహార పదార్థాలను నిలువ చేసుకోవడానికి ఫ్రిడ్జ్‌లు ఉండేవి కాదు. కాబట్టి ఆహార పదార్థాలను బయటపెట్టి పులియపెట్టుకుంటూ సంరక్షించుకునేవారు. దీంతో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు, సీలింధ్రాలు ఆహార పదార్థాలను ఆల్కహాల్‌గా మార్చేసేవి. ఇలా చేసినప్పుడు ఆహార పదార్థాలు పులుపుతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిచేవి. అందుకోసమే డాక్టర్లు ప్రతిరోజు తప్పకుండా పులిసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతుంటారు. అసలు పులిసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పులియపెట్టిన ఆహార పదార్థాలలో ఉండే బ్యాక్టీరియాలు మన శరీరంలో కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఫలితంగా మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాలు రక్త ప్రవాహంలోకి సమర్థవంతంగా కలిసిపోయి పేగుల్లో పీహెచ్ స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజు పులిసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఉబ్బసం, డయాబెటిస్, అల్జీమర్స్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా తగ్గించుకోవచ్చు. పుల్లపెట్టిన ఆహార పదార్థాలలో ఎక్కువగా మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల అధిక బరువు కూడా తగ్గుతారు. పులిసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి పోషణతో పాటు శక్తిని కూడా అందిస్తాయి. పులియపెట్టిన ఆహార పదార్థాలలో ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌లు సంవృద్ధిగా ఉంటాయి. దీంతో మన శరీరానికి పోషణ లభిస్తుంది. వీటిలో ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు ఇవి దోహదపడతాయి. పులియపెట్టిన ఆహారాల్లో లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లు ఉంటాయి. పెరుగు, పన్నీర్, ఇడ్లీ, దోశ లాంటివి పులియపెట్టిన ఆహారాల కిందకు వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News