EPAPER

Skin Cancer: వీటితో స్కిన్ క్యాన్సర్ ప్రమాదం.. షాకింగ్ నిజాలు ఇవిగో !

Skin Cancer: వీటితో స్కిన్ క్యాన్సర్ ప్రమాదం.. షాకింగ్ నిజాలు ఇవిగో !

Skin Cancer:  క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో స్కిన్ క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా స్కిన్ క్యాన్సర్ వ్యాపిస్తోంది. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రమాదకరమైన కొన్ని రకాల వస్తువులను వాడకుండా ఉండడం మంచిది. చాలా మంది చర్మ సౌందర్యం కోసం రకరకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సువాసననిచ్చే పర్ఫ్యూమ్, లోషన్లు, సబ్బులు వంటి వాటివల్ల చర్యంపై ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ రోజులు వీటిని వాడడం వల్ల స్కిన్ రాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా ఇవి చర్మ క్యాన్సర్లకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


సన్ స్కీన్:
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సన్‌స్క్రీన్‌లో ఆక్సి బెంజోన్, అవో బెంజోన్ వంటి రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి యూవీ కిరణాల నుంచి ఇవి మన చర్మాన్ని రక్షిస్తాయి. కానీ కొంత కొందరిలో కెమికల్ సన్‌స్క్రీన్ కారణంగా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ కాలం వీటిని వాడడం వల్ల దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లకు దారి తీసి చర్మ క్యాన్సర్ వస్తుంది.

2019లో జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం 20 సంవత్సరాలకుపైగా రసాయనాలు కలిగిన సన్‌స్క్రీన్ లోషన్లు క్రమం తప్పకుండా వాడటం వల్ల వ్యక్తులు చర్మ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్‌లు పాల్గొన్నారు. కెమికల్స్ సన్ స్క్రీన్ వాడడం వల్ల అందులోని రసాయనాలు భవిష్యత్తులో స్కిన్ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంటుంది.


హెయిర్ డై:
చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీంతో జుట్టు నల్లగా కనిపించడం కోసం హెయిర్ డైలను వాడుతున్నారు. కానీ ఇవి కూడా స్కిన్ క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జుట్టుకు వేసుకునే కొన్ని రకాల హెయిర్‌ డైలల్లో పీపీడీ అనే రసాయనం ఉంటుంది. ఫలితంగా వీటిని ఎక్కువగా వాడినప్పుడు స్కిన్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై క్యాన్సర్‌కు దారితీస్తుంది.

ప్రిజర్వేటివ్స్:
వీటి వాడకం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాస్మోటిక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ..పారాబెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా చర్మం ఇనప్లమేషస్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Also Read: ఖాళీగా ఉన్న సమయంలో ఒక్కసారి ఈ శవాసనం ట్రై చేయండి.. లాభాలు తెలిస్తే పక్కా చేసేస్తారు

ఆ విషయాల విషయంలో జాగ్రత్త:
నిఖిల్ కలిగి ఉండే నగలు, కొన్ని రకాల వంటి వస్తువులను వాడకం వల్ల కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొందరి శరీరానికి నిఖిల్ సంబంధిత వస్తువులు తరచు తాగడం వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని కారణంగా దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ తలెత్తడమే కాకుండా చర్మ కణాలు, డీఎన్‌ఏకు నష్టం కలిగిస్తాయి. ఫలితంగా చర్మ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సహజ పద్ధతుల్లో చర్మ సంరక్షణకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Big Stories

×